అసలు ‘హాల్‌మార్క్‌’ ఎట్ల గుర్తుపట్టాలే!

అసలు ‘హాల్‌మార్క్‌’ ఎట్ల గుర్తుపట్టాలే!

న్యూఢిల్లీ: నగలపై ఉన్న హాల్​మార్క్​​ సరైనదో, కాదో తెలుసుకోవడం ఇప్పుడు అవసరం. ఎందుకంటే దేశంలోని 256 జిల్లాలలో బుధవారం నుంచి జ్యుయెలరీకి  హాల్​మార్కింగ్‌‌‌‌ను తప్పనిసరి చేశారు. తర్వాత కాలంలో దీనిని ఇతర జిల్లాలలోనూ అమలు చేయనున్నారు. ​  దీంతో నగలపై ఉన్న హాల్​మార్క్​ సరయినదో, కాదో తెలుసుకోవల్సిన అవసరం ఏర్పడుతోంది. జ్యుయెలర్​ తనంతట తానుగా ఈ హాల్​మార్క్​ను వేశారా లేక ఆ హాల్​మార్క్​ కరెక్టేనా అనేది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం....

1. మొదటగా నగలపై ఉన్న హాల్​మార్క్‌‌‌‌ను జాగ్రత్తగా గమనించండి. అందులో మూడు ఉండాలి. అవేమిటంటే, ట్రయాంగిల్‌‌‌‌తో కూడిన బీఐఎస్​ (బ్యూరో ఆఫ్​ఇండియన్ స్టాండర్డ్స్) మార్కింగ్​ ఒకటి. ఎన్ని కేరట్లనేది (22కే915) కూడా ఉంటుంది. ఇదే బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ) మనకు తెలియచేస్తుంది. జ్యుయెలర్​మార్కు, ఏహెచ్‌‌‌‌సీ (ఎస్సేయింగ్​అండ్ హాల్​మార్కింగ్​సెంటర్) మార్క్‌‌‌‌ కూడా ఉంటాయి.
2. తన బీఐఎస్​ లైసెన్స్‌‌‌‌ను చూపించమని మనం జ్యుయెలర్‌‌‌‌‌‌‌‌ను అడగొచ్చు. బీఐఎస్ గైడ్​లైన్స్​ ప్రకారమైతే వారి లైసెన్స్‌‌‌‌ను కనబడేలా జ్యుయెలర్లు పెట్టాలి. ఆ స్లిప్‌‌‌‌పై ఉన్న అడ్రెస్​ జ్యుయెలరీ షాపు అడ్రెస్​ఒకటో, కాదో సరిపోల్చుకోవాలి.
3. బిల్​బ్రేకప్ వివరాలను మనం కోరవచ్చు. బిల్లులో హాల్​మార్కింగ్​ఛార్జీలను ప్రత్యేకంగా చూపించమని కూడా మనం అడగొచ్చు. ఎస్సేయింగ్​అండ్​హాల్​మార్కింగ్ సెంటర్లు జ్యుయెలర్ల నుంచి ఒక్కో ఐటమ్​కు రూ. 35 చొప్పున ఛార్జ్​ చేస్తాయి.
4. కొంత ఛార్జ్​ చెల్లించి మనం కూడా నగలను ఏహెచ్‌‌‌‌సీలో చెక్​ చేయించుకోవచ్చు. ఏహెచ్‌‌‌‌సీల అడ్రస్‌‌‌‌లు బీఐఎస్​ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంటాయి. సస్పెండయిన లేదా లైసెన్స్‌‌‌‌లు క్యాన్సిల్ చేసిన ఏహెచ్‌‌‌‌సీల వివరాలనూ ప్రత్యేకంగా ఈ వెబ్‌‌‌‌సైట్‌లో పెడతారు. కన్జూమర్లు ఇచ్చే నగలపై హాల్​మార్కింగ్‌‌‌‌ను కూడా కొంత ఛార్జీతో ఈ ఏహెచ్‌‌‌‌సీలు టెస్ట్​ చేస్తాయి. అలా టెస్ట్​ చేసిన తర్వాత ఏహెచ్‌‌‌‌సీ మనకు ఒక రిపోర్టు ఇస్తుంది. ఒకవేళ బంగారం ప్యూరిటీ తక్కువగా ఉందని ఆ రిపోర్టులో ఉంటే, మొదట సర్టిఫికేషన్​​ ఇచ్చిన ఏహెచ్‌‌‌‌సీ కన్జూమర్‌‌‌‌‌‌‌‌కు ఫీజును రిఫండ్​ చేయాల్సి ఉంటుంది.
5. ఆ రిపోర్టుతో జ్యుయెలర్​ దగ్గరకు వెళ్లి నగల ప్యూరిటీ గురించి ప్రశ్నించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కన్జూమర్‌‌కు జ్యుయెలర్​ తప్పనిసరిగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.  

హాల్​మార్కింగ్​ గైడ్​లైన్స్​....
రూ. 40 లక్షలలోపు టర్నోవరుండే జ్యుయెలర్లను హాల్​మార్కింగ్​ రూల్​ నుంచి మినహాయించారు.ఇంటర్నేషనల్​ ఎగ్జిబిషన్స్, డొమెస్టిక్​ బీ2బీ ఎగ్జిబిషన్స్​కోసం చేసే జ్యుయెలరీకి ​ కూడా హాల్​మార్కింగ్​ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. అంతేకాదు 20, 23, 24 కేరట్ల బంగారానికి హాల్​మార్కింగ్​అవసరం ఉండదని రూల్స్​ చెబుతున్నాయి. వాచీలు, ఫౌంటెన్​పెన్లు, కుందన్, పొల్కి, జడావు వంటి స్పెషల్ టైపు జ్యుయెలరీకి హాల్​మార్కింగ్​ అవసరం లేదు.

పాత జ్యుయెలరీ సంగతేంటి..
కన్జూమర్ల దగ్గర నుంచి హాల్​మార్కింగ్​ లేకపోయినా పాత బంగారు నగలను జ్యుయెలర్లు కొనచ్చు. మాన్యుఫాక్చరర్లకు, హోల్​సేలర్లకు, రిటెయిలర్లకు తగినంత టైము ఇచ్చే ఉద్దేశంతో ఆగస్టు చివరిదాకా ఎలాంటి పెనాల్టీలూ వేయరు. అంతేకాదు, పాత నగలకు కూడా కావాలనుకుంటే హాల్​మార్కింగ్​ వేయించుకోవచ్చు. లేదంటే, పాత నగలను కరిగించి కొత్త నగలుగా చేయించుకున్నాక హాల్​మార్కింగ్​ పొందవచ్చు. ఈ కొత్త స్కీము అమలులో వచ్చే ఇబ్బందులను పరిశీలించడం కోసం రెవెన్యూ అధికారులు, లీగల్​ ఎక్స్​పర్టులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. హాల్​మార్కింగ్​ రూల్​ గతంలోనే రావల్సినా, కరోనా​ వలన వాయిదాపడింది.

హాల్​మార్కింగ్ రూల్ ఎందుకు తెచ్చారు...
బంగారం ప్యూరిటీ విషయంలో కస్టమర్లకు నమ్మకం కలిగించడానికి సాయపడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హాల్​మార్కింగ్​ను తప్పనిసరి చేసింది. అంతేకాదు, దీని వల్ల  గ్లోబల్​గా మన దేశం గోల్డ్​మార్కెట్ సెంటర్‌‌‌‌‌‌‌‌గా మారుతుందనేది కూడా ప్రభుత్వ ఆలోచన. దేశంలో ఎస్సేయింగ్ సెంటర్లు (ఏహెచ్‌‌‌‌సీలు) గత అయిదేళ్లలో 25 శాతం పెరిగినట్లు గవర్నమెంట్​చెబుతోంది. ఒక ఏహెచ్‌‌‌‌సీ ఒక రోజులో 1500 ఆర్టికల్స్​కు హాల్​మార్కింగ్​ చేయగలదు.  ప్రస్తుతం 14 కోట్ల ఆర్టికల్స్‌‌‌‌కు హాల్​మార్కింగ్​ వేసే కెపాసిటీ మనకు ఉంది.