
ఎప్పుడూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తే గానీ నిద్ర పట్టదు కొందరికి. అందుకనే ఒక చెఫ్ ఏం చేసిందో చూడండి. సాస్ అనేది రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో చూసుంటారు. ఇప్పుడు వాటి లిస్ట్‌లో మరో కలర్ చేరింది. అదే పింక్ సాస్. పేరు వినడానికే డిఫరెంట్‌గా ఉంది కదా. ఫ్లోరిడాకు చెందిన ఒక చెఫ్ దీన్ని తయారుచేసింది. సాస్ కలర్, బాటిల్ కలర్, దాని పేరు కూడా పింక్ కలర్లోనే ఉంటాయి. దీన్ని తయారుచేయడానికి సన్ ఫ్లవర్ ఆయిల్, డ్రాగన్ ఫ్రూట్, చిల్లీ, తేనె, వెల్లుల్లి వాడారు. చూడ్డానికి ఇది వెరైటీగా అనిపించినా... కొందరు మాత్రం దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, కెఎఫ్సి చికెన్ మీద వేసుకుని తెగ లాగించేస్తున్నారు. వాళ్లు పింక్ సాస్ని ఎంజాయ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది చూసి కొందరు నెటిజన్లు ‘పింక్ లేక్ (గులాబీ రంగు సరస్సు)’ నుంచి తయారుచేశారేమో అంటూ కామెంట్లుపెడుతున్నారు. ఇప్పటికే గ్రీన్ చికెన్ వంటివి రుచి చూసే ఉంటారు. అలాగే ఇది కూడా ఇప్పుడు వింతగా అనిపించినా, కొన్నిరోజులకు మామూలైపోతుంది. ఏదేమైనప్పటికీ దీని వల్ల రంగులు ముఖ్యం కాదు. రుచే ముఖ్యం అని మరోసారి ప్రూవ్ అయింది.