టెలిగ్రామ్‌‌లో సీక్రెట్‌‌ చాట్‌‌

టెలిగ్రామ్‌‌లో సీక్రెట్‌‌ చాట్‌‌

టెలిగ్రామ్‌‌ యాప్‌‌లో వాట్సాప్‌‌లో ఉన్నట్టే చాట్‌‌ చేసుకో వచ్చు, కాల్స్‌‌ మాట్లాడుకోవచ్చు, ఫొటోస్‌‌, వీడియోస్‌‌, ఫైల్స్‌‌ లాంటివి కూడా పంపుకోవచ్చు. వాట్సాప్‌‌లో ఉండే ఎండ్‌‌ టు ఎండ్ ఎన్‌‌క్రిప్షన్‌‌ ఫీచర్‌‌‌‌ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ‘టైమర్‌‌‌‌’, ‘సీక్రెట్‌‌ చాట్‌‌’ అని రెండు కొత్త అప్‌‌డేట్స్‌‌ను తీసుకొచ్చింది టెలిగ్రామ్‌‌. 

టైమర్‌‌‌‌ అప్‌‌డేట్‌‌తో మీడియా, ఫైల్స్, ఫొటోస్‌‌ సెండ్‌‌ చేసేముందు టైమర్‌‌‌‌ను సెట్‌‌ చేసుకోవచ్చు. మెసేజ్‌‌ సెండ్‌‌ చేసే ముందు ఎంత టైం సెట్‌‌ చేస్తే మెసేజ్‌‌ రిసీవ్‌‌ చేసుకున్న వాళ్లకు అంత సేపు మాత్రమే ఆ మెసేజ్‌‌ కనిపిస్తుంది. తరువాత ఆ మెసేజ్‌‌ మాయమైపోతుంది. ‌‌సీక్రెట్‌‌ చాట్‌‌ ఫీచర్‌‌‌‌ ఎలా పనిచేస్తుందంటే, చాట్‌‌లో ఎండ్‌‌ టు ఎండ్‌‌ ఎన్‌‌క్రిప్షన్‌‌ ఉంటుంది. అంటే చాట్‌‌ చేసుకునే ఇద్దరు వ్యక్తులు మాత్రమే మెసేజెస్‌‌ చదవచ్చు. అంతేకాకుండా సీక్రెట్‌‌ చాట్‌‌లో చేసిన మెసేజ్‌‌ వేరే వాళ్లకు ఫార్వర్డ్‌‌ చేయకూడదు. మెసేజ్‌‌ పంపి ఎంత సేపయినా సరే, డిలిట్‌‌ ఫర్‌‌‌‌ ఎవ్రీవన్‌‌ అనే ఆప్షన్‌‌ పోదు. మెసేజ్‌‌ పంపిన వ్యక్తి ఎప్పుడు డిలిట్‌‌ చేసినా ఇద్దరి ఫోన్‌‌లో డిలిట్‌‌ అవుతుంది.