సేల్స్​మ్యాన్​గా మొదలై, స్టార్​బక్స్​ చైర్మన్​గా ఎదిగిన హవర్డ్​ షుల్జ్​

సేల్స్​మ్యాన్​గా మొదలై, స్టార్​బక్స్​ చైర్మన్​గా ఎదిగిన హవర్డ్​ షుల్జ్​

పొద్దున లేవగానే వేడివేడి కాఫీనో, టీనో తాగందే ఏమీ తోచదు చాలామందికి. కొందరైతే రోజుకు కనీసం ఐదారుసార్లయినా తాగుతారు. అంతేకాదు, ఇంటికి చుట్టాలొచ్చినా, ఫ్రెండ్స్​తో బాతాఖానీ కొట్టేందుకైనా, ఆఫీసులో పని ఒత్తిడి నుంచి రిలాక్స్​ కావాలన్నా గుర్తొచ్చేది, తోడుండేది టీ, కాఫీలే. అంతలా అవి మన జీవితంలో భాగం అయిపోయాయి. అందుకే టీ, కాఫీ దొరికే స్టాల్స్​, హోటల్స్, కెఫెలు​ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీటన్నిటిలోనూ వరల్డ్​ నెం.1​ ‘స్టార్​బక్స్​’. దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్న ఈ కంపెనీని వంద బిలియన్​ డాలర్ల బ్రాండ్​గా మార్చిన ఘనత హవర్డ్​ షుల్జ్​ది. తినడానికి తిండిలేని దశ నుంచి సేల్స్​మ్యాన్​గా మొదలై, స్టార్​బక్స్​ చైర్మన్​గా ఎదిగిన ఆయన జీవితంలోని సంఘటనలే ఈ స్టోరీ. 

అమెరికాలోని న్యూయార్క్​ సిటీకి ఆనుకొని ఉండే బ్రూక్లిన్​లో జూలై 19, 1953లో పుట్టాడు హవర్డ్​ షుల్జ్​. తల్లిదండ్రులు ఫ్రెడ్​, ఎలీన్​. వీళ్లు స్కాట్లాండ్​ నుంచి వలస వచ్చినవాళ్లు. చాలా పేదకుటుంబం. పేదల కోసం ప్రభుత్వం కట్టించిన బిల్డింగ్​లో ఒకే ఒక గదిలో ఉండేవాళ్లు. ఫ్రెడ్​, ఎలీన్​కు హవర్డ్​కు తోడు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. 

తండ్రి మంచాన పడడంతో..

కుటుంబం గడవడం కోసం దొరికిన పని చేసేవాడు ఫ్రెడ్​. కూలిపనులకు వెళ్లడం, కూరగాయలు అమ్మడం వంటివి చేసేవాడు. చివరికి అమెరికా సైన్యంలో వెహికల్స్​ నడపడానికి డ్రైవర్​గా చేరాడు. రెండో ప్రపంచయుద్ధంలో కూడా పాల్గొన్నాడు. హవర్డ్​కు ఏడేండ్లు ఉండగా ఒకరోజు రోడ్డు ప్రమాదంలో ఫ్రెడ్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఆరోజు నుంచి అతను మంచానికే పరిమితమయ్యాడు. దాంతో కుటుంబ బాధ్యతలను ఎలీన్​ తీసుకుంది. ఎన్ని కష్టాలున్నా పిల్లల్ని మాత్రం బడికి పంపడం ఆపలేదామె.

ఫీజు కోసం రక్తం అమ్మి.. 

కుటుంబం కోసం అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి, తాను కూడా పార్ట్​టైమ్​ జాబ్స్​ చేయడం మొదలుపెట్టాడు హవర్డ్. పన్నెండేండ్ల వయసులో పేపర్​బాయ్​గా చేరాడు. ఇంటింటికీ తిరిగి న్యూస్​పేపర్స్​ వేసేవాడు. ఆ తర్వాత ఒక కెఫెలో చేరాడు. అయితే, చదువు మాత్రం ఆపలేదు. 1971లో హైస్కూల్​ చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత కాలేజీలో చేరడానికి తగిన డబ్బు లేదు. దానికోసం అప్పటికే ఒక ప్లాన్​ రెడీ చేసుకున్నాడు​. స్పోర్ట్స్​ కోటా స్కాలర్​షిప్స్​ కోసం ట్రై చేశాడు. ఎందుకంటే ఫుట్​బాల్, బేస్​బాల్​, బాస్కెట్​బాల్​ ఆటల్లో హవర్డ్​ మంచి కీ ప్లేయర్​. అతను కోరుకున్నట్లే నార్తర్న్​ మిషిగన్​ యూనివర్సిటీలో స్పోర్ట్స్​ కోటా స్కాలర్​షిప్స్​తో సీటు తెచ్చుకున్నాడు. అయితే, ఫీజు కట్టడానికి ఆ డబ్బు సరిపోలేదు. దాంతో ఫ్రెండ్స్​ దగ్గర అప్పు తీసుకునేవాడు. వాటిని చెల్లించడానికి పార్ట్​టైమ్​ జాబ్స్ చేసేవాడు.  అయినా, డబ్బు సరిపోక చాలాసార్లు తన రక్తం కూడా అమ్ముకున్నాడు. అలా కష్టాలు పడుతూనే1975లో బిజినెస్​ అండ్​ మార్కెటింగ్​లో డిగ్రీ​ పూర్తిచేశాడు. 

బతిమాలుకొని ‘స్టార్​బక్స్’​లోకి

చదువు పూర్తయ్యాక మిషిగన్​లోనే ఒక లాడ్జ్​లో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు హవర్డ్.​ తర్వాత న్యూయార్క్​లోని ‘జిరాక్స్’ కంపెనీలో చేరాడు. మూడేండ్లు అక్కడ సేల్స్​మ్యాన్​గా చేశాక, ఒక హోమ్​ అప్లయన్స్​ కంపెనీలో చేరాడు. అక్కడ ఇంటికి అవసరమైన రకరకాల వస్తువుల్ని అమ్మేవాళ్లు. వాటిలో కాఫీ గింజల్ని ప్రాసెసింగ్​, గ్రైండింగ్​​ చేసే మెషిన్స్​ కూడా ఉండేవి. ​వీటిని కొనడానికి అప్పుడప్పుడు వచ్చే ‘స్టార్​బక్స్​’ ఉద్యోగితో హవర్డ్​కు  ఫ్రెండ్ షిప్​ పెరిగింది. ఒకరోజు ఆ ఫ్రెండ్​ కోరడంతో సియాటెల్​లోని ‘స్టార్​బక్స్’ షాప్​కు వెళ్లాడు. ​అక్కడ కాఫీ గింజల్ని, కాఫీ మెషిన్స్​ను అమ్మేవాళ్లు. ఆ బిజినెస్​కు మంచి ఫ్యూచర్​ ఉంటుంది అనిపించింది హవర్డ్​కు. న్యూయార్క్​కు తిరిగి వెళ్లినప్పటికీ అతని మనసంతా ‘స్టార్​బక్స్’పైనే ఉంది. దాంతో చాలాసార్లు స్టార్​బక్స్​ చైర్మన్​కు ఫోన్​ చేసి ఉద్యోగం కోసం బతిమాలుకున్నాడు. చివరికి ఆయన ఒప్పుకున్నాడు. అయితే, హవర్డ్​కు ప్రస్తుతం వస్తున్న జీతంలో సగం మాత్రమే ఇస్తామన్నాడు.  దానికి సంతోషంగా ఒప్పుకున్న హవర్డ్​1982లో న్యూయార్క్​ను వదిలిపెట్టి సియాటెల్​కు చేరుకున్నాడు. హవర్డ్​కు ప్రస్తుతం వస్తున్న జీతంలో సగం మాత్రమే ఇస్తామన్నాడు.  దానికి సంతోషంగా ఒప్పుకున్న హవర్డ్​1982లో న్యూయార్క్​ను వదిలిపెట్టి సియాటెల్​కు చేరుకున్నాడు. 

మలుపుతిప్పిన ఇటలీ ప్రయాణంకాఫీలు ఉండేవి. అంతేకాదు, అక్కడ హవర్డ్​ను ఆకట్టుకున్న మరో విషయం ఉంది. అది.. హోటల్స్​లో మాదిరే  కస్టమర్స్​ కూర్చోవడానికి, గంటల తరబడి మాట్లాడుకుంటూ కాఫీలు తాగడానికి అవసరమైన కుర్చీలు, టేబుల్స్​ ఆ కెఫెల్లో ఉండడం. అలాగే, కస్టమర్స్​ ఆర్డర్స్​ ఇచ్చిన వాటిని వేడివేడిగా తయారుచేయడానికి, సర్వ్​ చేయడానికి పనివాళ్లు కూడా ఉండేవాళ్లు. దాంతో ఆ కెఫెలన్నీ ఎప్పుడూ జనంతో కిటకిటలాడేవి. హవర్డ్​ ఇటలీ నుంచి తిరిగి సియాటెల్​కు వెళ్లాక తాను చూసినదాన్ని ‘స్టార్​బక్స్​’ ఓనర్స్​కు చెప్పాడు. మనం కూడా అలాగే షాప్​ని మారుద్దామని, మరికొన్ని బ్రాంచ్​ల్ని పెడదామని సలహా ఇచ్చాడు. అయితే, హవర్డ్​ మాటల్ని వాళ్లు ఒప్పుకోలేదు. కారణం.. అప్పటికీ కాఫీ అంటే కేవలం ఇంట్లో మాత్రమే చేసేదని, అది కూడా ఆడవాళ్ల డ్యూటీ మాత్రమేనని వాళ్లు అనుకోవడం. దాంతో తానే సొంతంగా కాఫీ బిజినెస్​ స్టార్ట్​ చేయాలనుకున్నాడు హవర్డ్​. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 

సొంతంగా బిజినెస్​లోకి..

సొంతంగా కాఫీ బిజినెస్​​ పెట్టడానికి హవర్డ్​కు 1.7 మిలియన్​ డాలర్లు అవసరమైంది. అంత డబ్బు అతని దగ్గర లేదు. దానికోసం బ్యాంక్​లో లోన్​తోపాటు, స్టార్​బక్స్​ ఓనర్స్​ నుంచి అప్పు తీసుకున్నాడు. ఆ సొమ్ముతో 1986 ఏప్రిల్​లో సియాటెల్​లో ‘ఈల్​ జోర్నాలే’ పేరుతో షాప్ మొదలుపెట్టాడు. దీనికి మొదటిరోజు నుంచే జనం బాగా రావడం మొదలైంది. ఏడాదిలోనే అప్పులు తీరిపోవడంతోపాటు లాభం కూడా వచ్చింది. అదే టైంలో ‘స్టార్​బక్స్​’ను అమ్మేయాలని అనుకున్నారు దాని ఓనర్లు. వెంటనే వాళ్లను కలసి తనకే అమ్మాలని కోరాడు. అయితే, వాళ్లు 4 మిలియన్​ డాలర్లు అడిగారు. అంత డబ్బు లేకపోవడంతో మళ్లీ కొంత మంది దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పుడు హవర్డ్​కు అప్పు ఇచ్చినవాళ్లలో బిల్​ గేట్స్​ కూడా ఉన్నాడు. ఎలాగైతేనేం స్టార్​బక్స్​ను సొంతం చేసుకున్నాడు హవర్డ్​. దాంట్లోకి తన కంపెనీ ‘ఈల్​ జోర్నాలే’ను కలిపేశాడు.  

వరల్డ్​ నెం.1గా..     

‘స్టార్​బక్స్​’ను కొన్నాక బిజినెస్​ను మరింత డెవలప్​ చేయాలనుకున్నాడు హవర్డ్​. ఇటలీలోని కెఫెల్లో కాఫీ తయారుచేసే ఉద్యోగుల్ని రప్పించాడు. అలాగే కాఫీలో సరికొత్త బ్రాండ్స్ తెచ్చాడు. కాఫీ, టీలకు తోడు ఐస్​క్రీమ్స్, ఫుడ్​ ఐటమ్స్, బేకరీ ప్రొడక్ట్స్, స్నాక్స్​, స్వీట్స్​ వంటివి కూడా మెల్లగా మెనూలో చేర్చాడు.  దాంతో ‘స్టార్​బక్స్’కు డిమాండ్​ బాగా పెరిగింది. మెల్లగా బ్రాంచ్​లు వేరే సిటీల్లోనూ మొదలుపెట్టాడు. అలా అమెరికాలోని దాదాపు అన్ని టౌన్​లలోనూ ‘స్టార్​బక్స్​’ మొదలైంది. ఆ తర్వాత వేరే దేశాల్లో కూడా బ్రాంచ్​లు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 33వేలకు పైగా ‘స్టార్​బక్స్’​ కెఫెలు ఉన్నాయి. అలాగే స్టార్​బక్స్​ బ్రాండ్​ విలువ 100 బిలియన్​ డాలర్లకు చేరింది. హవర్డ్​ దాదాపు 4 బిలియన్​ డాలర్ల ఆస్తులతో ‘ఫోర్బ్స్​’ టాప్​‌‌‌‌‌‌‌‌–500 బిలియనీర్స్​ లిస్ట్​లో ఉన్నాడు​. హవర్డ్​కు 1982లో షెరి కెర్ష్​తో పెండ్లి అయింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు. 

‘స్టార్​బక్స్​’కు మొదటి ఓనర్లు జెర్రీ బాల్డ్విన్​, సీగెల్​, గోర్డాన్​. వీళ్లు యూనివర్సిటీ ఆఫ్​ శాన్​ఫ్రాన్సిస్కోలో చదివేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. కాఫీని చాలా ఇష్టపడే ఈ ముగ్గురూ సియాటెల్​ కేంద్రంగా మార్చి 30, 1971లో కాఫీ షాప్​ పెట్టారు. అప్పటికి ఫేమస్​ అయిన ‘మోబీ–డిక్​’ నవలలోని క్యారెక్టర్​ అయిన ‘స్టార్​బక్​’ పేరు పెట్టారు. ఆ నవల్లో తిమింగలాల వేటకు వాడే పడవకు కెప్టెన్​ స్టార్​బక్​. లోగో కోసం గ్రీక్​ పురాణాల్లో కనిపించే ‘రెండు తోకల మత్స్యకన్య’ బొమ్మను  ఎంచుకున్నారు. కారణం ఏంటంటే మత్స్యకన్యలు పడవల్లో వెళ్లేవాళ్లను ఆకర్షిస్తారు. అలాగే, తమ కాఫీ షాప్​ కూడా కస్టమర్లను ఆకర్షించాలనుకున్నారు ఆ మిత్రులు. అందుకే రెండు తోకల మత్స్యకన్య బొమ్మను లోగోగా ఎంచుకున్నారు. 

యువత కోసం షుల్జ్​ ఫౌండేషన్​ 

ప్రపంచంలోని కుబేరుల్లో ఒకడిగా మారినప్పటికీ తన మూలాలను మాత్రం  మర్చిపోలేదు హవర్డ్​. చిన్నప్పుడు తమ ఫ్యామిలీ పడిన కష్టాలు, చదువు, ఉద్యోగం, బిజినెస్​ టైంలో తాను పడిన ఇబ్బందులు అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అందుకే పేదలు, యువత కోసం 1996లో  ‘షుల్జ్​ ఫ్యామిలీ ఫౌండేషన్​’ పెట్టాడు. కుల, మత, వర్ణ వివక్ష లేకుండా పేదరికం పోగొట్టడానికి అవసరమైన కార్యక్రమాలు, చదువు​ కోసం సాయం చేస్తుంది ఈ సంస్థ. దీనికోసం ఎన్నో వందల డాలర్లు ఖర్చుపెట్టాడు. అలాగే సొంతంగా బిజినెస్​, స్టార్టప్స్​ పెట్టాలనుకునే యువత కోసం 2021లో 100 మిలియన్​ డాలర్లతో ‘ది ఎంట్రప్రెనూర్స్​ ఈక్విటీ ఫండ్​’ పేరుతో మరో ప్రాజెక్ట్​ కూడా స్టార్ట్​ చేశాడు.