భారీగా సబ్బుల ధరలను పెంచిన హెచ్​యూఎల్

భారీగా సబ్బుల ధరలను పెంచిన హెచ్​యూఎల్

న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్​యూఎల్​).. లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌బాయ్, లక్స్  పియర్స్ సబ్బులతో పాటు సర్ఫ్ ఎక్సెల్ మాటిక్, కంఫర్ట్ ఫాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్ వంటి బ్రాండ్ల ధరలను పెంచింది.   బ్రోకరేజ్ సంస్థ ఎడల్​వీస్​ సెక్యూరిటీస్ తెలిపిన వివరాల ప్రకారం హెచ్​యూఎల్  హోమ్,  పర్సనల్ కేర్ కేటగిరీ ప్రొడక్టుల ధరలు 1-–9 % వరకు పెరిగాయి. ఈ ఎఫ్​ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీ  ఫిబ్రవరిలో ధరలను పెంచడం ఇది రెండోసారి. “ హెచ్​యూఎల్​ ఫిబ్రవరిలో మరోసారి ధరలను పెంచింది. సర్ఫ్ ఎక్సెల్ మాటిక్, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండీషనర్, డోవ్ బాడీ వాష్, లైఫ్‌‌‌‌బాయ్, లక్స్  పియర్స్ సోప్స్,  రిన్  వంటి అనేక ప్రొడక్టుల ధరలను పెంచింది’’ అని ఎడల్‌‌‌‌వీస్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  అవ​నీశ్​ రాయ్ తెలిపారు. రెండు వారాల క్రితం ఇదే కంపెనీ సబ్బులు, డిటర్జెంట్లు  డిష్ వాషింగ్ ప్రొడక్టుల రేట్లను 3-–10 % వరకు పెంచింది. వీటిలో సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ డిటర్జెంట్, సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్, విమ్ బార్  లిక్విడ్, లక్స్,  రెక్సోనా సబ్బులు,  పాండ్స్ టాల్కమ్ పౌడర్‌‌‌‌లు ఉన్నాయి.