కురుమూర్తి హుండీ ఆదాయం రూ.17.87 లక్షలు

కురుమూర్తి హుండీ ఆదాయం రూ.17.87 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు: మండలంలోని కురుమూర్తి స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం టెంపుల్  ఆవరణలో లెక్కించారు. రూ.17,87,463 వచ్చినట్లు ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపులో ఎండోమెంట్ సీఎఫ్​వో రఘునాథ్, ఇన్స్ పెక్టర్  శ్రీనివాస్, మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డి వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది శ్రీకర్, శ్రవణ్ కుమార్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.  

వేలంపాటలో భారీగా ఆదాయం..

గద్వాల: నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ, పరుశరాముడి ఆలయం వద్ద వచ్చే ఏడాది కొబ్బరికాయల అమ్మకం కోసం నిర్వహించిన వేలంపాటలో రూ.44.35 లక్షలకు పులిపాటి నగేశ్​ పాట పాడి దక్కించుకున్నాడు. కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పల సేకరణ, లడ్డూ అమ్మకాల కోసం గురువారం ఆలయం ఆవరణలో వేలంపాట నిర్వహించారు.

కొబ్బరి చిప్పల సేకరణను కురువ అనిల్  రూ.6.67 లక్షలకు, లడ్డూ, పులిహోర ప్రసాదం అమ్మకం కోసం రాకేశ్  రూ.6.41 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. చీరల వేలం పాటలో ఇద్దరు మాత్రమే పాల్గొనగా, రూల్స్ ప్రకారం ముగ్గురు డీడీ కట్టాల్సి ఉంటుంది. దీంతో ఆ వేలాన్ని వాయిదా వేశారు. ఎండోమెంట్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, పురేంధర్  పాల్గొన్నారు.