కల్తీ కల్లు కేసు.. భార్యాభర్తలకు ఏడేండ్ల జైలు

కల్తీ కల్లు కేసు.. భార్యాభర్తలకు ఏడేండ్ల జైలు

యాదాద్రి, వెలుగు: కల్తీ కల్లు కేసులో భార్యాభర్తలకు ఏడేండ్ల జైలు శిక్ష విధించడంతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ యాదాద్రి జిల్లా జడ్జి బాల భాస్కర్​రావు తీర్పునిచ్చారు. భువనగిరి రూరల్ ఎస్సై హెచ్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బాలంపల్లికి చెందిన దూడల మల్లయ్య, అతడి భార్య దూడల బతుకమ్మ అలియాస్ బక్కమ్మ కల్లు అమ్మేవారు.

23 డిసెంబర్​ 2015లో అదే గ్రామానికి చెందిన కాశపాక మల్లేశ్, మరో నలుగురు వీరి దగ్గర కల్లు తాగి పడిపోయారు. ట్రీట్​మెంట్ తీసుకుంటూ కాశపాక మల్లేశ్​చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి భువనగిరి సీఐ తిరుపతి దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం కల్తీ కల్లు అమ్ముతున్నట్టు కోర్టులో రుజువు కావడంతో దంపతులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.