వీళ్లు మామూలోళ్లు కాదు.. స్టాక్ ట్రేడింగ్.. B2B ఎక్స్పోర్ట్స్ పేరుతో కోట్లలో మోసాలు.. ఎలా చిక్కారంటే..

వీళ్లు మామూలోళ్లు కాదు.. స్టాక్ ట్రేడింగ్.. B2B ఎక్స్పోర్ట్స్ పేరుతో కోట్లలో మోసాలు.. ఎలా చిక్కారంటే..

ఈజీ మనీ కోసం కొందరు చేసే జిమ్మిక్కులు చూస్తుంటే పోలీసులకే ఆశ్చర్యం కలగక మానదు. డబల్ రిటర్న్స్ ఇస్తామని అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో.. కోట్లల్లో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసాలకే పాల్పడిన నిందితులను శుక్రవారం (ఆగస్టు 01) హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. స్టాక్ ట్రేడింగ్, బీటూబీ ఎక్స్ పోర్ట్స్ మోసాల కింద రెండు కేసులకు సంబంధించి ఆశ్చర్యపోయే నిజాలను వెల్లడించారు హైదరాబాద్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్. 

మొదటి కేసు : -స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం 

స్టాక్ ట్రేండిగ్ చేస్తే లాభాలు వస్తాయని నిందితులు అమాయకులను బురిడీ కొట్టించి మోసం చేశారు. ట్రేడింగ్ లో లాభాలు చెప్పడంతో నమ్మిన ఒక నిందితులకు రూ. లక్షా డెబ్భై వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. దీంతో ఆ డబ్బుతో ట్రేడ్ చేసినట్లు.. లాభాలు వచ్చినట్లు  ఫేక్ రిటర్న్ స్టేట్మెంట్స్ కనపడేలాగా చూయించారు. మొత్తం లాభాం  20 వేల యూఎస్ డాలర్స్ సంపాదించినట్లు సదరు వ్యక్తికి చూయించారు నిందితులు. 

అయితే  - అవి విత్ డ్రా చేసుకుందామంటే అవకాశాలు లేకుండా ఉందని గుర్తించిన బాధితుడు.. ప్రశ్నించగా మరింత ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆశచూపారు. దీంతో మరో ఏడున్నర లక్షలు ( రూ.7.5 లక్షల) డిపాజిట్ చేయించారు. అప్పటికీ డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో అనుమానం వచ్చి బాధితుడు ఫిర్యాదు చేశాడు. అప్పటికే జరగాల్సిన మోసం జరిగిపోయింది.

ఈ డబ్బులన్నీ కొందరు అమాయకుల ఖాతాల్లో పడ్డాయని..  సైబర్ నేరగాళ్లు వేరే వారి బ్యాంక్ ఖాతాలను వాడుకున్నట్లు సీపీ చెప్పారు. ఈ ఫ్రాడ్ కేసులో - నలుగురు అకౌంట్ సప్లయర్లను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. 

ఈ కేసులో  నిజామాబాద్ కు చెందిన చికాల సంతోష్ కుమార్ అనే ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.  హైదరాబాద్ ఎయిర్ పోర్టులో గ్రౌండ్ కెప్టెన్ గా పనిచేసిన సంతోష్.. బయటికి వచ్చి వీసా కన్సల్టెన్సీ పెట్టాడు. అమాయకుల్ని, నిరుద్యోగులను ఇతర దేశాలకు పంపించేవాడు.  కాంబోడియాలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కొంతమందిని పంపించాడు. 

చివరికి నిందితుడు సంతోష్ కుమార్ కూడా మరో ముగ్గిరితో కలిసి కంబోడియా వెళ్లాడు. - అక్కడ ఒక కాల్ సెంటర్లో పని చేశాడు. తనే సొంతంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు.   కాల్ సెంటర్ ఆధారంగా అనేక సైబర్ మోసాలకు పాల్పడ్డాడు.  ఇలా అనేక మందిని విదేశాలకు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్న సంతోష్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు హైదరాబాద్ ఏసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. 

రెండో కేసు: B to B ఎక్స్పోర్ట్స్ పేరుతో మోసం

ఇలాంటిదే మరో భారీ స్కాంకు కారణమైన- బీటు బీ ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పేరుతో మోసం కేసును ఛేదించిన ఏసీపీ తెలిపారు. లేని కంపెనీని ఉన్నట్లుగా చూపించి.. భారీ ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయించుకుని మోసం చేశారు దుండగులు.- ట్రేడ్ ఫండమెంటల్  ఢిల్లీకి చెందిన కంపెనీగా నిందితులు పరిచయం చేసుకున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఒక కోటీ 11 లక్షల రూపాయలు వ్యాపారితో బదిలీ చేయించుకున్నారని.. - ఇదంతా రిఫండబుల్ అని బురిడీ కొట్టించారని తెలిపారు. 

ఈ కేసులో- ఫండమెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన నిందితుడు పరాస్ సింగ్లను అరెస్ట్ చేశారు. - అతని సోదరుడు మహేష్ సింగ్ల పరారీలో ఉన్నాడని తెలిపారు. లేని కంపెనీని ఉన్నట్టుగా చెప్పి డబ్బులు బదిలీ చేయించుకున్నారు.  కోటి 11 లక్షల రపాయల డబ్బును వాళ్ళ సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. ప్రజలు ఈ తరహా సైబర్ నేరాలపట్ల అప్రమతంగా ఉండాలని సూచించారు ఏసీపీ విశ్వప్రసాద్.