పాకిస్తాన్ లో అరెస్టైన హైదరాబాద్ వ్యక్తి

పాకిస్తాన్ లో అరెస్టైన హైదరాబాద్ వ్యక్తి

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్‌ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు విశాఖ పట్టణానికి చెందిన ప్రశాంత్ ఉన్నాడు. హైదరాబాద్ లో ప్రశాంత్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తో పాటు  ప్రశాంత్‌ ఉన్నారు. ప్రశాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో పాకిస్తాన్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్‌ కుట్ర పన్నిందని పాక్‌ మీడియా ఆరోపించింది. అతడు 2017 నుంచి కనిపించట్లేదని సమాచారం.

ప్రశాంత్ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అతన్ని విడిపించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. అయితే ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన వీడియో విడుదలైంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇస్తారు. బెయిల్ వస్తే మీతో మాట్లాడవచ్చు. మరో నెల రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పాడు.

మరోవైపు ప్రశాంత్ తన ప్రియురాలి కోసం గూగుల్‌ మ్యాప్‌లో వెతుకుతూ పాక్‌లోకి ప్రవేశించాడని సమాచారం.