హైదరాబాద్ విద్యుత్ శాఖలో ఏసీబీ కలకలం

హైదరాబాద్ విద్యుత్ శాఖలో ఏసీబీ కలకలం

హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. కొద్దిసేపటి క్రితం యాకత్ పురా సెక్షన్ విద్యుత్ ఏ ఈ రాజ శేఖర్ తోపాటు బిల్ కలెక్టర్ మొహ్మద్ జమాల్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

బాధితుడి నుంచి లంచం తీసున్నట్లు నిర్ధారణ కావడంతో వెంటనే అదుపులోకి తీసుకుని కార్యాలయంతోపాటు వారి ఇండ్లలోనూ సోదాలు చేపట్టారు. తీసుకున్న లంచం డబ్బును సీజ్ చేసి సోదాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.