హైదరాబాద్: రాజేంద్రనగర్పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మరణించింది. చిలుకూరు నుంచి రాజేంద్రనగర్ వెళ్లే సర్వీస్ రోడ్ వద్ద అర్ధరాత్రి సమయంలో అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వేగంగా ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి సమీరా ఫాతిమా(3) స్పాట్లోనే చనిపోయింది. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీంచారు. గాయపడిన వారిని పాతబస్తీలోని నవాబ్ కుంటకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :- MS Dhoni: ధోని జ్ఞాపకాన్ని ఇంట్లో భద్రంగా దాచాను..: సునీల్ గవాస్కర్
