చిరంజీవి కంటే నేనే తోపు... అప్పట్లో నావే ఎక్కువ హిట్స్ .. మెగాస్టార్‌పై శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

చిరంజీవి కంటే నేనే తోపు... అప్పట్లో నావే ఎక్కువ హిట్స్ .. మెగాస్టార్‌పై శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఒక ప్రభంజనం. అయితే, లేటెస్ట్ గా టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శివకృష్ణ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆరంభంలో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి... ఇదే పచ్చి నిజం అంటూ శివకృష్ణ బాంబు పేల్చారు.  చిరు కంటే తానే పెద్ద స్టార్ నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకే దారితీశాయి.

ఆరంభంలో నేనే తోపు.. 

నిజానికి, 1970ల చివరలో చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. చిన్న పాత్రలు, విలన్ రోల్స్ కూడా చేశారు. కానీ అదే సమయంలో శివకృష్ణ వరుస యాక్షన్ హిట్స్‌తో దూసుకుపోతూ మాస్ హీరోగా ఒక ఊపు ఊపారు. సరిగ్గా ఈ పాయింట్ గురించే శివకృష్ణ మాట్లాడుతూ.. మా కెరీర్ల ప్రారంభంలో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. ఇది పచ్చి నిజం. నేను చాలా త్వరగా హీరోగా సెటిలై సక్సెస్ అయ్యాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కంటే నా మార్కెట్, నా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

నేను చేసిన తప్పులేంటంటే?

ఫుల్ కమర్షియల్ సినిమాల్లో రిస్క్ తీసుకుని మరి డూప్ లేకుండా ఫైట్స్ చేసేవాడిని. నాకంటూ ఒక క్రేజ్ ఉండేది అని తెలిపారు శివకృష్ణ. అయితే, ఇంతటితో ఆగకుండా తాను చేసిన తప్పులేంటో కూడా ఆయన అంతే ఓపెన్‌గా ఒప్పుకున్నారు. నేను కొన్ని రకాల పాత్రలకే పరిమితమయ్యాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోలేదు. కానీ, చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, తనను తాను మలుచుకుంటూ దూసుకుపోయాడు అని చిరు స్మార్ట్ వర్క్‌ను కొనియాడారు.

ALSO READ : ఎన్టీఆర్ కొత్త లుక్తో సోషల్ మీడియా షేక్..

చిరు'నెంబర్ 1' ఎలా అయ్యారంటే..?

నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే... నేనెప్పుడూ అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరగలేదు. నచ్చని పాత్రలను మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశాను. అదే తన కెరీర్‌కు మైనస్ అయిందని శివకృష్ణ అంగీకరించారు. కానీ చిరంజీవి అలా కాదు... వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ, తనేంటో నిరూపించుకుంటూ ముందుకు సాగారు. ఒక నటుడికి అన్ని రకాల పాత్రలు చేయాలనే కసి ఉండాలి. అది చిరంజీవిలో పుష్కలంగా ఉంది.  తాను కమర్షియల్ సినిమా పల్స్ పట్టుకోవడంలో లేట్ అయ్యానని, కానీ చిరంజీవి ప్రేక్షకుల నాడిని ముందే పసిగట్టి ఇండస్ట్రీకి కావాల్సిన అసలైన కమర్షియల్ స్టార్‌గా ఎదిగారని శివకృష్ణ కొనియాడారు. అందుకే ఆయన టాలీవుడ్ అల్టిమేట్ 'నెంబర్ 1' హీరో అయ్యారు అంటూ మెగాస్టార్ క్రేజ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను వెల్లడించారు.

వైరల్ అవుతున్న కామెంట్స్!

శివకృష్ణ చేసిన ఈ క్రేజీ కామెంట్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతుండగా, మరికొందరు మాత్రం శివకృష్ణ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఈగో పక్కనపెట్టి తన తప్పులను ఒప్పుకుంటూనే, మెగాస్టార్ ప్రయాణాన్ని అభినందించిన శివకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ ఇండస్ట్రీలో తనదైన గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ 'ఫ్లాష్ బ్యాక్' వార్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.