వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనుంది.. కానీ గెలవదు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలనుంది.. కానీ గెలవదు

పూంఛ్: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుందని.. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్ లో కాంగ్రెస్ పార్టీ  నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 300 ఎంపీ సీట్లు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆజాద్.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదన్నారు. 

‘300 సీట్ల టార్గెట్ ను కాంగ్రెస్ చేరుకోవాలని ఆశిస్తున్నా. కానీ అది జరిగేలా లేదు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి పలు సంవత్సరాలుగా పార్లమెంటులో నేను పోరాడుతున్నా. మిగతా మెంబర్స్ ఎవరూ దీని గురించి మాట్లాడరు. ఈ విషయం కోర్టులో ఉంది. కాబట్టి నా చేతుల్లో లేని విషయం గురించి ప్రజలకు నేను ఏమీ చెప్పలేను. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే అప్పటిదాకా మనం ఎదురు చూస్తూ కూర్చోలేం. ఇక్కడి భూములు, జాబ్స్ కశ్మీరేతరులకు పోతున్నాయి’ అని గులాం నబీ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

కొత్త వేరియంట్ ఎప్పుడొస్తుందనేది చెప్పలేం

భయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్ 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?