భయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్ 

భయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్ 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శించారు. ‘సవాళ్లంటే భయం, సత్యమంటే భయం, సాహసమన్నా భయమే.. ఏ ప్రభుత్వతమైతే భయపడుతుందో, అది అన్యాయమే చేస్తుంది’ అని కేంద్రాన్ని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. డిబేట్ (చర్చ), డిస్సెంట్ (అసమ్మతి), డెమొక్రసీ (ప్రజాస్వామ్యం) అనే హ్యాష్ ట్యాగ్ లను ఆయన ట్వీట్ కు జత చేశారు. 

కాగా, వివాదాస్పద సాగు చట్టాలపై పార్లమెంట్ లో చర్చించకుండానే రద్దు చేయడంపై రాహుల్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.  ఏ విషయంపై అయినా చర్చలకు సరేనని చెప్పిన ప్రధాని మోడీ.. ఎలాంటి చర్చలు జరపకుండానే చట్టాలను రద్దు చేశారని విమర్శించారు. రాహుల్ తోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు, విపక్ష ఎంపీలు కూడా కేంద్రం తీరుపై విమర్శలకు దిగారు. ‘ఈ బిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు ఇరు పక్షాలు ఒప్పుకోలేదు. అయినా బిల్లులను తీసుకొచ్చారు. అయితే వాటి రద్దుకు ఇరు పక్షాలు అంగీకారం తెలిపినా చర్చ జరగలేదు. ఏదేమైనప్పటికీ చర్చ జరగలేదనేది మాత్రం విస్పష్టం’ మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ట్వీట్ చేశారు. చర్చల్లేని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? 

ఒకే నెలలో 20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

కొడుకును కరిచిందని.. కుక్కను చంపిన తండ్రి