అభినందన్​ స్క్వాడ్రన్‌కు మరో అవార్డ్

అభినందన్​ స్క్వాడ్రన్‌కు  మరో అవార్డ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్​ యుద్ధవిమానం ఎఫ్​16  కూల్చేసిన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్దమాన్​టీమ్​కు వాయుసేన యూనిట్​ సైటేషన్​ అవార్డు ప్రకటించింది. ఎయిర్​ఫోర్స్​లోని 51 స్క్వాడ్రన్​లో అభినందన్​ సభ్యుడు.. బాలాకోట్​పై దాడి తర్వాత  పాక్​ ఎఫ్​16 యుద్ధ విమానంతో ప్రతిస్పందించింది. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. వింగ్​ కమాండర్​ అభినందన్​ సహా మరో పైలట్ మిగ్​21 ఫైటర్​తో​ ఈ యుద్ధ విమానాన్ని ఎదుర్కొన్నారు. ఎఫ్​16 విమానాన్ని అభినందన్​ కూల్చేశారు. మరో విమానాన్ని తరుముతూ పీవోకేలోకి వెళ్లారు. మిగ్​ 21 కూలిపోవడంతో పాక్​ సైన్యానికి చిక్కడం, తర్వాత విడుదల కావడం తెలిసిందే! పాక్​ యుద్ధ విమానాన్ని కూల్చడంలో అభినందన్​ టీమ్  కనబరిచిన సాహసానికి యూనిట్ సైటెషన్ అవార్డు దక్కింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా చేతుల మీదుగా  కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ ఈ నెల 8న ఈ అవార్డు అందుకోనున్నారు.