పరీక్షల కోసం లైబ్రరీ ఏర్పాటు చేసిన ఐఏఎస్​​ శ్వేతా శర్మ

పరీక్షల కోసం లైబ్రరీ ఏర్పాటు చేసిన ఐఏఎస్​​ శ్వేతా శర్మ

ఢిల్లీ శివార్లలో కరాలా అనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్లో ఎంతోమంది అమ్మాయిలు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్​ అవుతారు. ఎలాంటి ఫెసిలిటీస్​ లేకుండా కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​లో సక్సెస్​ అవుతున్నారు. ఇది గమనించిన ఐఏఎస్​​ శ్వేతా శర్మ ఆడవాళ్లకు హెల్ప్​ చేసేందుకు ముందుకు వచ్చారు. 

ఈ ఊళ్లో ఇంజినీరింగ్​, మెడిసిన్​, యూపీఎస్సీ పరీక్షలకు పోటీపడుతున్న అమ్మాయిలు ఉన్నారు. వీళ్లతో పాటు చదువంటే ఎంతో ఇష్టపడే వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ ప్రోత్సహించడానికి నార్త్​ ఈస్ట్​ డిల్లీ సబ్​ డివిజన్​ కలెక్టర్​ శ్వేతా శర్మ చొరవ తీసుకున్నారు. ఆ ఊరికి దగ్గరగా ఒక బిల్డింగ్​ను తీసుకొని లైబ్రరీ ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షల పుస్తకాలే కాకుండా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందులో ఉంచారు.  మహిళల కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ లైబ్రరీలో విమెన్​ ఎడ్యుకేషన్​ను ఎంకరేజ్​ చేసే ఆర్ట్స్​ ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న మహిళల సమస్యలను తీర్చడానికి కౌన్సెలింగ్ సెంటర్​గా కూడా దీన్ని వాడతాం అంటున్నారు ఐఏఎస్​ శ్వేతా శర్మ. ఈ కమ్యూనిటీ- లెవల్ లైబ్రరీ రీడర్స్​కు సెక్యూరిటీని కూడా ఇస్తుంది. ఊరికి దగ్గరగా ఉండటంతో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కిందటి ఏడాది ఈ ఊరికి చెందిన ఒక అమ్మాయి పోటీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంది. అప్పటికి అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. ‘‘అమ్మాయిల కోసం అన్ని ఫెసిలిటీలతో లైబ్రరీ ఉంటే... కరాలాతో పాటు చుట్టుపక్కల ఊళ్లవాళ్లకు కూడా ఉపయోగపడుతుంది’’ అన్నారు శ్వేతా శర్మ.