Good Health : షుగర్ ఉందని.. రాత్రి పూట భోజనం మానేశారా.. ఏం జరుగుతుందో తెలుసుకోండి

Good Health : షుగర్ ఉందని.. రాత్రి పూట భోజనం మానేశారా.. ఏం జరుగుతుందో తెలుసుకోండి

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నవారే. జంక్ ఫుడ్ తినే అలవాట్లు వచ్చిన తర్వాత ఇంట్లో తినటం బొత్తిగా మానేశారనే చెప్పాలి. ఏదైనా ఆర్డర్ చేసుకోవడం.. నిమిషాల్లో తెప్పించుకుని తినటం జరుగుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి.. అడ్డమైన ఫుడ్ తినే అలవాట్లు ఎక్కవయ్యాయి. దీంతో బరువు పెరిగి పోతున్నారు. ఒకోనొక సందర్భంలో సన్నబడాలంటే చాలా కష్టమైన పనిగా రియలైజ్ కావాల్సి వస్తోంది. అయితే సన్నబడేందుకు సాయంత్రం తినటం మానేస్తే సరిపోతుంది అని డిన్నర్ స్కిప్ చేస్తున్నారు.  

అధిక బరువుతో ఇబ్బంది పడే చాలా మంది.. సన్నబడాలని ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒక పూట ఆహారాన్ని మానేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ ముఖ్యం.. డిన్నర్ చేయకపోయిన పర్లేదు అని కొందరు అనుకుంటే.. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్.. నైట్ డిన్నర్ చేస్తే సరిపోతుందని కొందరు అనుకుంటుంటారు. రాత్రిపూట పడుకునేదే కదా.. తినకపోయినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్లకు డాక్టర్లు ఆశ్చర్యపోయే సీక్రెట్స్ చెబుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్.. డే స్టార్ట్ అవుతుంటే.. మనం కూడా మంచి ఎనర్జీతో కిక్ స్టార్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా డిన్నర్.. నెక్స్ట్ డే బ్రేక్ ఫాస్ట్ వరకు మనం ఇచ్చే 12 లేదా 14 గంటల గ్యాప్ లో కావాల్సిన కేలరీలను బాడీకి అందిస్తుంది. 

ALSO READ | Health tips: కళ్ల ఒత్తిడి తగ్గాలంటే.. ఇన్బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీటింగ్ ప్యాడ్స్ ‘ఐ మసాజర్’

అయితే రాత్రి పూట భోజనం మానేయటం మన బాడీని పలు రకాలుగా ప్రభావితం చేస్తుంటుంది. ఏదో ఒకరోజు మానేస్తే పెద్ద సమస్యేమీ ఉండదు కానీ.. రెగ్యులర్ గా డిన్నర్ తీసుకోకపోవటం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ విషయంపై డాక్టర్లు ఏం చెప్తున్నారో చదవండి. 

జీవక్రియను డిస్ట్రబ్ చేస్తుంది:

రెగ్యులర్ గా డిన్నర్ తినకపోవటం వలన.. జీవక్రియ (మెటబాలిజం) స్లో డౌన్ అయిపోతుంది. రోజూ తినకపోవటం వలన.. బాడీ తానికదే లోపల ఉండే కొవ్వులను బర్న్ చేసి వినియోగించడం స్టార్ట్ చేస్తుంది. ఎనర్జీ కోసం అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ బర్న్ అయిపోవటం వలన... తీవ్ర అలసట ఒత్తిడి ఏర్పడటమే కాకుండా వెయిట్ లాస్ కావడం కూడా చాలా కఠినంగా మారిపోతుంది. 

బ్లడ్ షుగర్ లో మార్పులు:

డిన్నర్ స్కిప్ చేయడం వలన.. ఓవర్ నైట్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోతాయి. డే టైమ్ లో సరిగ్గా తిననప్పుడు షుగర్ లెవల్స్ మరింతగా డౌన్ అవుతాయి. దీనివలన తలతిరగటం, తలనొప్పి, అలసట, ఇరిటేషన్ మొదలైన సమస్యలు వస్తాయి. ఇది ఇలాగే రిపీట్ అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పై ప్రభావం చూపిస్తుంది. టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే.. ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంటుంది. రక్తకణాలు ఇన్సులిన్ కు రియాక్ట్ కాకపోవడం వలన ఎక్కువ మొత్తంలో గ్లూకోస్ ను స్వీకరించి.. డయాబెటిస్ కు అంటే షుగర్ వ్యాధికి దారి తీస్తాయి. 

కొవ్వు కరగడం అంటుంచితే.. కండలు కోల్పోతాం:

డిన్నర్ తినక పోవటం వలన ఫ్యాట్ కరుగుతుందని అనుకుంటారు చాలా మంది. కానీ తినక పోవటం వలన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందకపోవడంతో.. ఎక్కువ శాతం మసిల్స్ లాస్ అవుతామని డాక్టర్లు చెబుతున్నారు.

ఈటింగ్ డిసార్డర్ రిస్క్:

నైట్ టైమ్ లో ఫుడ్ స్కిప్ చేయడం వలన ఈటింగ్ డిసార్డర్ వస్తుంటుంది.. అంటే అర్థరాత్రి లేచి తినే అలవాటు.. లేదంటే వేళ మరిచి ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు వస్తుంటుందని చెబుతున్నారు. దీని కారణంగా మెంటల్, ఎమోషనల్ కండీషన్స్ మారిపోతాయని అంటున్నారు. 

పోషకాల లోపం:

బాడీకి ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్స్, మినరల్స్స్ లాంటి మంచి పోషకాలన్నీ డిన్నర్ నుంచే అందుతాయని చెబుతున్నారు వైద్యులు. ప్రతిరోజు రాత్రి భోజనం మానేయటం ద్వారా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, బి--విటమిన్స్ బాడీకి సమపాళ్లలో అందక పోవటం వలన.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. బాడీకి కావాల్సిన ఎనర్జీ, రోగనిరోధక శక్తి అన్ని సక్రమంగా అందాలంటే రాత్రిళ్లు భోజనం మానేయటం సరికాదని సూచిస్తున్నారు.