25ఏళ్ల యువతితో ఏఎస్ఐ రాసలీలలు!

25ఏళ్ల యువతితో ఏఎస్ఐ రాసలీలలు!

జగిత్యాల: 25ఏళ్ల యువతితో లవ్ స్టోరీ నడిపిస్తున్న ఏఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.  ఓ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని ముగ్గులోకి దింపాడు ఏఎస్ఐ. ఇంకేముంది.. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.  ఈక్రమంలో వారు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏఎస్ఐ ఎఫైర్ పై సీరియస్ అయిన ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న ఏఎస్ఐని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పోలీస్ స్టేషన్ లో.. తన భర్తపై వర్షకొండ గ్రామానికి సదరు యువతి ఫిర్యాదు చేసింది. రోజూ తాగి వచ్చిన తనను కొడుతున్నాడని.. భర్త నుంచి తననను కాపాడమని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఏఎస్ఐ రాములు.. సదరు యువతి భర్తను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాడు.అయినా అతను మారకపోడంతో.. సదరు యువతి తరుచూ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు వస్తుండడంతో.. విచారణ పేరుతో ఏఎస్ఐ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమంలో ఇద్దరు కలిసి తిరుగుతూ సన్నిహితంగా ఉన్నారు. అయితే, వీరి ఫోటోలు బయటకు రావడంతో మరికొన్ని రోజుల్లో రిటైర్డ్ కావాల్సి ఏఎస్ఐపై బదిలీ వేటు పడింది.