వరల్డ్ కప్ క్వాలిఫయర్: అమెరికాను చీల్చి చెండాడిన జింబాబ్వే

వరల్డ్ కప్ క్వాలిఫయర్: అమెరికాను చీల్చి చెండాడిన జింబాబ్వే

వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచులో జింబాబ్వే బ్యాటర్లు వీరవిహారం చేశారు. సీన్ విలియమ్స్(174) భారీ శతకం బాదడంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గంభీ- ఇనోసెంట్ కియా జోడి తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సీన్ విలియమ్స్.. అమెరికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న విలియమ్స్ 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. 
 
చివరలో సికందర్ రజా(27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 4 సిక్సులు), ర్యాన్ బర్ల్(16 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సులు) కూడా మెరుపులు మెరిపించడంతో జింబాబ్వే అమెరికా ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అమెరికా బౌలర్లలో అభిషేక్ పరద్కర్ 3 వికెట్లు తీసుకోగా.. జెస్సీ సింగ్ 2, నోస్తుష్ కెంజిగే ఒక వికెట్ పడగొట్టాడు. 

ఈ బౌలింగ్ చూశాక అమెరికా బౌలర్లను నెటిజన్స్ ఆటాడుకుంటున్నారు. వెంటనే జట్టును మార్చేయాలని అమెరికా అధ్యక్షుడైన బైడెన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. "బైడెన్ ఇలాగైతే లాభం లేదు.. జట్టును మార్చాల్సిందే. డబ్బులు ఎదజల్లి ఆటగాళ్లను కోనేయండి. అప్పుడే అమెరికా పరువు నిలబెట్టగలరు.." అని కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ:పవర్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?  

ZIM 408/6 (50) Against United States

బైడెన్ ఇలాగైతే లాభం లేదు.. జట్టును మార్చాల్సిందే. డబ్బులు ఎదజల్లి ఆటగాళ్లను కోనేయండి. అప్పుడే అమెరికా పరువు నిలబెట్టగలరు. pic.twitter.com/IAaJdGTk3A

— Muskmelon (@gova3555) June 26, 2023