
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీనాటికి 1 లక్ష 61 వేల 330 టెస్టులు చేశామని, 6,872 మందికి పాజిటివ్ వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శనివారం ప్రకటించింది. 1 లక్ష 47 వేల 330 మంది నుంచి సేకరించిన శాంపిళ్లను టెస్టు చేసినట్లు తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 15,663 శాంపిల్స్ టెస్టు చేయగా 433 మందికి పాజిటివ్ గా తేలిందని వెల్లడించింది. హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఉన్న అందరికీ టెస్టులు నిర్వహిస్తామని ఐసీఎంఆర్ చెప్పింది. దేశంలో 213 టెస్టింగ్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 46 గవర్నమెంటువి కాగా, 67 ప్రైవేటు ల్యాబ్ లని తెలిపింది.