కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే

కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే

డాగ్స్‌‌‌‌‌‌‌‌తో కొవిడ్ ‌‌‌‌‌రోగుల గుర్తింపు
ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో స్టార్ట్‌‌‌‌‌‌‌‌
వాసన చూసి 10 సెకన్లలో చెప్పేలా ట్రైనింగ్

న్యూఢిల్లీ: కరోనా సోకిందో లేదో గుర్తించేందుకు టెంపరేచర్ చెక్ చేయడం.. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలున్నాయో లేదో గుర్తించడం ఇప్పటివరకు అందరూ ఫాలో అవుతున్నారు. కానీ ఓ దేశం డిఫరెంట్గా రోగులను గుర్తించేందుకు కుక్కలను వాడుతోంది. కరోనా ఉన్న ప్యాసింజర్లను గుర్తించేందుకు ఫిన్లాండ్ దేశంలోని హెల్సింకీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వేర్వేరు జాతులకు చెందిన 4 డాగ్స్ను రెడీగా ఉంచారు. రోగులను గుర్తించేందుకు వీటికి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. వైరస్ శాంపిల్ను వాసన చూసి కరోనాను గుర్తిస్తే అవి పంజాతో గోకడం, కింద పడుకోవడం, మొరగడం లాంటి సంజ్ఞలు చేస్తాయని అధికారులు తెలిపారు. కుక్కలు వాసన పసిగట్టడంలో ఎక్స్పర్ట్స్ అని, ఈ విధానం మంచి ఫలితాలనిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ చెందిన ప్రొఫెసర్ అన్నా హిల్మ్ జోర్క్మన్ తెలిపారు. ఇక్కడ సక్సెసయితే హాస్పిటళ్లు, పోర్టులు, ఓల్డేజ్ హోమ్స్, కల్చరల్, స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతామన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికే కుక్కలను వాడుతోంది. యూఏఈలోని దుబాయ్ ఎయిర్పోర్టులో కుక్కలతో రోగులను గుర్తించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫిన్లాండ్ రెండో దేశం.

ఫస్ట్ యూఏఈలో..
హెల్సింకీ ఎయిర్పోర్టులో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్యాసింజర్లతో కుక్కలతో రోగాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ప్యాసింజర్ను తన స్కిన్ను ఓ వైప్(కాగితం)తో తుడుచుకోమని చెబుతారు. తర్వాత దాన్ని జార్లో కలెక్ట్ చేసి కుక్క దగ్గరకు తీసుకెళ్తారు. అది స్మెల్ చేసి 10 సెకన్లలో రోగం ఉందీ లేనిది గుర్తిస్తుంది. ఇదంతా ఒక నిమిషంలో జరిగిపోతుందని అధికారులు చెప్పారు. ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే ప్యాసెంజర్ను రెగ్యులర్ టెస్టు చేయించుకోమంటున్నం అని చెప్పారు. నాలుగు కుక్కల్లో 2 డ్యూటీలో ఉంటే 2 బ్రేక్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాల్లోనూ కుక్కలతో కరోనా రోగులను గుర్తించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

For More News..

చెరువుల్ని మింగి సిటీని ముంచుతున్నరు

ఈ నెల 28న రాష్ట్ర బంద్

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వర్కర్ల ట్రైనింగ్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన యూఎస్