వచ్చే కొన్ని నెలలు టీమిండియాకు చాలా కీలకం

వచ్చే కొన్ని నెలలు టీమిండియాకు చాలా కీలకం

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో టీమిండియా కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ప్లేయర్లు గాయాలతో దూరమవ్వడం కూడా జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తోంది. రీసెంట్ గా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో ఈ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో టీమ్ ను పటిష్టంగా రూపొందించాలన్నాడు. 

‘ఇండియన్ క్రికెట్ కు ఇది కీలకమైన సమయం. రానున్న 8 నుంచి 10 నెలల్లో జట్టులో చాలా మార్పులను చూస్తాం. అయితే మరో నాలుగైదేళ్లు జట్టును ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను గుర్తించాలి. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలి. యువ ప్లేయర్లు, అనుభవజ్ఞుల కూడికతో జట్టును బలోపేతం చేయాలి. యంగ్ ప్లేయర్ల కోసం అన్వేశించాలి. ఒకే టీమ్ తో ఎక్కువ కాలం జట్టును నడపడం కష్టతరమవుతుంది’ అని పాకిస్థాన్ వెటరన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ లో రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తల కోసం:

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

ఇప్పుడంతా ఓటీటీల మాయ..

అరుణ్ బతకడం అద్భుతమే