ఎయిరిండియా కొత్త సీఈవోగా ఇల్క‌ర్ అయిజు

ఎయిరిండియా కొత్త సీఈవోగా ఇల్క‌ర్ అయిజు

ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకున్న టాటా గ్రూప్ దానికి పూర్వవైభవం తెచ్చే పనిలో పడింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రయత్నిస్తున్న సంస్థ తాజాగా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓను అపాయింట్ చేసింది. గతంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ చీఫ్ గా ఉన్న ఇల్కర్ అయిజు పేరు ఖరారు చేసింది. 2022 ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ ఛైర్మన్ అలెక్స్ క్రూజ్ వంటి వారు రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చినా చివరకు ఆ అవకాశం ఇల్కర్ ను వరించింది. 

1971లో ఇస్తాంబుల్లో జన్మించిన ఇల్కర్ అయిజు గతంలో టర్కిష్ ఎయిర్లైన్స్ ఛైర్మన్గా పనిచేశారు. అంతకు ముందు ఆ సంస్థ బోర్డులో మెంబర్గా ఉన్నారు. 1994లో బిల్ కెంట్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా పొందిన అయిజు.. అనంతరం యూకే లీడ్స్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో రీసెర్చర్ గా చేశారు. మర్మరా యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేశారు. టర్కిష్ ఎయిర్లైన్స్ను విజయవంతంగా నడిపించిన ఇల్కర్.. ఎయిరిండియాను నవ శకం దిశగా నడిపించేందుకు టాటా గ్రూప్లోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అన్నారు.

For more news..

కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మూడు రోజులు ఘనంగా సంబరాలు

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం