భానుడి ప్రకోపం.. విలవిల్లాడుతున్న జనం..

భానుడి ప్రకోపం.. విలవిల్లాడుతున్న జనం..

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రకోపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతుండటంతో జనం బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీ సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. 

రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. జనం అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

For more news..

 

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాదే

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా