
అంతకుముందు మస్తు ట్రై చేసిన..
వాళ్లే రెస్పాండ్ కాలే
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ఇకమీదట ఇండియాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ‘ఇప్పటికే ఎన్నోసార్లు శాంతి చర్చలు జరుపుదామని ఇండియాను కోరితే వాళ్లు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలే.. అందుకే ఇక చర్చలకు ఫులిస్టాప్ పెట్టాలని డిసైడ్ చేసినం’ అని గురువారం న్యూయార్క్ టైమ్స్ తో చెప్పారు. ఇండియా కోరినట్లు టెర్రరిస్టు గ్రూపులపై కూడా కావాల్సినన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ‘ఇండియాతో మాట్లాడటంలో అర్థం లేదు. ఇప్పటికే చర్చల పెట్టుకుందం అని నేను ఎంత చెప్పాల్నో అంత చెప్పిన. కానీ, అడిగిన ప్రతిసారీ నేనేదో బుజ్జగింపు ముచ్చట్లు చెప్తున్న అనుకున్నరు. ఇంక మేం చేయగలిందేమీ లేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు న్యూక్లియర్ పవర్ కలిగివున్న రెండు దేశాల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందన్నారు.
చర్చలు అంటూనే దాడులా..
పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్ ను అమెరికాలోని ఇండియా అంబాసిడర్ హర్షవర్దన్ ష్రింగ్లా కొట్టిపారేశారు. శాంతి చర్చల గురించి పాక్ అడిగిన ప్రతిసారీ చొరవ చూపించాం. కానీ, అదే సమయంలో అక్కడినుంచి టెర్రరిస్టుల దాడులు ఎదుర్కొన్నాం. ఇప్పటికైనా టెర్రరిస్టులు కోలుకోలేని విధంగా పాక్ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం’ అని అన్నారు.