
ఇస్లామాబాద్ : జమ్మూకాశ్మీ ర్ కోసం ఎంతకైనా తెగి స్తామని, అవసరమైతే అణు బాంబులు వాడటానికి కూడా రెడీగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నా రు. ప్రపంచ దేశాలన్నీ పాక్ కు సపోర్ట్ చేయాలని, ఒకవేళ అణుయుద్ధమే వస్తే సర్వనాశనం తప్పదని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ బెదిరింపులకు దిగారు. కాశ్మీ ర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదంటూ మోడీతో భేటీలో ట్రంప్ క్లారిటీ ఇచ్చిన కొద్దిసేపటికే పాక్ పీఎం ఇమ్రాన్ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. జమ్మూకాశ్మీ ర్ కు స్పెషల్ స్టేటస్ రద్దు చేసి మోడీ చారిత్రక తప్పి దం చేశారని, అయితే దీన్ని ఇంటర్నేషనల్ ఇష్యూగా మార్చడంలో పాక్ సక్సె స్ అయిందన్నా రు.
‘‘పాక్ కు వ్యతిరేకంగా ఇండియా భారీ కుట్రలు చేస్తోంది. కాశ్మీర్ విషయంలో గట్టి స్టాండ్ తీసుకోవాల్సి న టైమొచ్చింది. ఆఖరికి ఇస్లామిక్ దేశాలు కూడా మనకు అండగా నిలబడకపోవడం బాధాకరం. తమ వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా వాళ్లలా చేశారు. ఏ ఒక్కరూ సపోర్ట్ చేయకున్నా మనం వెనక్కి తగ్గేదే లేదు. ఎంతకైనా తెగించడానికి రెడీ”అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పాక్ పీఎం కామెంట్స్‌ని ఇండియా ఖండించింది. ప్రశాంతంగా ఉన్న కాశ్మీ ర్ లో ఏదో జరిగిపోతోందంటూ ప్రాపగండా చేయడం పాక్ కు అలవాలేనని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నా రు. ఇదిలా ఉంటే, పాక్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీకి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ షాకిచ్చింది. కాశ్మీ ర్ పై ఆయన పోస్టు చేసిన వీడియో ఇండియా చట్టా లకు విరుద్ధం గా ఉందంటూ ఆయనకు నోటీసులు పంపింది. ట్విటర్ సంస్థ
మోడీ చేతిలో కీలుబొమ్మలా మారిందంటూ పాక్ మంత్రులు మండి పడ్డారు.