10 రోజుల్లో రూ. 6.40 పెరిగిన పెట్రోల్‌‌

10 రోజుల్లో రూ. 6.40 పెరిగిన పెట్రోల్‌‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు గురువారం కూడా పెరిగాయి. లీటర్‌‌‌‌‌‌‌‌పై 80 పైసలు చొప్పున పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్‌‌‌‌, డీజిల్ రేట్లు పెరిగాయి. ఈ పది రోజుల్లోనే లీటర్ పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధర రూ. 6.40 చొప్పున పెరిగింది. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 101.81 కి, డీజిల్ రేటు రూ. 93.07 కి చేరుకుంది. హైదరాబాద్‌‌‌‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 115.42 కి, డీజిల్ రేటు రూ. 101.58 కి పెరిగింది. ట్యాక్స్‌‌‌‌లను బట్టి వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్‌‌‌‌, డీజిల్ రేట్లు  వేరు వేరుగా ఉంటున్నాయి.