మస్త్ గోస పెడ్తుండు.. మీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయండి సార్ : శైజల్ 

మస్త్ గోస పెడ్తుండు.. మీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయండి సార్ : శైజల్ 

ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శైజల్ ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తక్షణమే చిన్నయ్యను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులు భూ కబ్జాలు చేస్తున్నారని శైజల్ ఆరోపించారు. అన్యాయంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని ఆరోపించారు. తనను చంపే కుట్ర చేస్తున్నారని, తనకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం (జూన్ 9న)  సీఎం కేసీఆర్ మంచిర్యాల వెళ్తున్న సందర్భంగా ఢిల్లీలోని జాతీయ బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో  శైజల్ నిరసన తెలిపింది.

https://www.youtube.com/watch?v=cZKV-jMp0yA