సీఎం కారులోనే కల్తీ డీజిల్.. ఇక సామాన్యుల పరిస్థితేంటి..!

సీఎం కారులోనే కల్తీ డీజిల్.. ఇక సామాన్యుల పరిస్థితేంటి..!

మొరాయించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కారు 
ఆయన కాన్వాయ్ లోని 19 కార్లదీ అదే పరిస్థితి
తోసుకుంటూ వెళ్లిన సిబ్బంది, అధికారులు
బంక్ నిర్వాహకుడు డీజిల్ లో నీళ్లు కలిపినట్టు గుర్తింపు
సీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు

 వీఐపీ కాన్వాయ్ అంటే ఎలా ఉంటుంది? దారిలో వెళ్లేటప్పుడు రయ్.. రయ్ మని దూసుకెళ్లేందుకు వీలుగా ఇతర వాహనాలు అడ్డురాకుండా జాగ్రత్త పడతారు. ఇక సీఎం కాన్వాయ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్ కాన్వాయ్ రావడానికి కొంతసేపు ముందు నుంచే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ ఆ కాన్వాయే సతాయిస్తే ఎలా ఉంటుంది? అంటే.. సరిగ్గా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పరిస్థితిలా ఉంటుంది. 

గురువారం (జూన్ 26) ఆయన కాన్యాయ్ లోని 19 వెహికల్స్ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ మొరాయించాయి. రత్లాంలోని ఓ కార్యక్రమంలో పాల్గొ నేందుకు సీఎం కాన్వాయ్ బయలుదేరిన కొద్దిసే పటికే రోడ్డుపై వాహనాలన్నీ మొరాయించడంతో డ్రైవర్లు, సిబ్బంది వాటిని తోయాల్సి వచ్చింది. ఆ వాహనాల్లోని డీజిల్ కల్తీ జరిగడమే కారణంగా తేలింది. 

Also Read : పాపం అద్దె తక్కువ అని.. పాత భవంతిలో ఉంటున్న కూలీలు

పెట్రోల్ బంక్ నుంచి డీజిల్ శాంపిల్స్ సేకరించిన అధికారులు అందులో నీళ్లు కలిపినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి పెట్రోల్ పంపును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.  బంకర్లు సాక్ష్యాత్తు సీఎం కాన్యాయ్ లోనే కల్తీ డీజిల్ పోస్తుంటే.. ఇక సామాన్యుల వాహనాల పరిస్థితేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.