సుశాంత్ డెత్ మిస్ట‌రీ : ముంబై పోలీస్ అధికారుల‌కు సీబీఐ స‌మ‌న్లు

సుశాంత్ డెత్ మిస్ట‌రీ : ముంబై పోలీస్ అధికారుల‌కు సీబీఐ స‌మ‌న్లు

దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇద్ద‌రు ముంబై పోలీసుల‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

సుశాంత్ కేసు ద‌ర్యాప్తులో పాల్గొన్న ముంబై పోలీసుల్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారిస్తున్న ముంబై పోలీసు అధికారుల్లో ఒక‌రు ఆస్ప‌త్రిలో ఉండ‌గా..మ‌రొక‌రు క‌రోనాతో హోం ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. సుశాంత్ కేసు ద‌ర్యాప్తు సంబంధించి పూర్తి డేటాను త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఆ ఇద్ద‌రు పోలీస్ అధికారుల్ని సీబీఐ కోరింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక సాక్షులు అయిన సుశాంత్ స్నేహితుడు సిధార్థ్ పిథానిని సీబీఐ ప్రశ్నించింది. సుశాంత్ మ‌ర‌ణానికి ముందు అత‌ని మాన‌సిక స్థితి ఎలా ఉంద‌నే స‌మాచారాన్ని సీబీఐ అధికారులు ప‌రిశీలిస్తున్నారు.