UP Rains: యూపీ జలప్రళయం..నీట మునిగిన వారణాసి, ప్రయాగ్ రాజ్..పడవల్లో ప్రయాణిస్తున్న ప్రజలు

UP Rains: యూపీ జలప్రళయం..నీట మునిగిన వారణాసి, ప్రయాగ్ రాజ్..పడవల్లో ప్రయాణిస్తున్న ప్రజలు

యూపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీవర్షాలు, వరదలతో అనేక నగరాలు ముంపునకు గురయ్యాయి. వారణాసి, ప్రయాగ్ రాజ్ నగరాలు నీటమునిగాయి. రెండు నగరాల్లో ప్రధాన రహదారులన్నీ నదిలా మారాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, జలౌన్, ఔరైయా, హమీర్‌పూర్, ఆగ్రా, మీర్జాపూర్, వారణాసి, కాన్పూర్ దేహత్, బల్లియా, బండా, ఇటావా, ఫతేపూర్, కాన్పూర్ నగర్ , చిత్రకూట్‌లతో సహా 14 జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయి.

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గంగా, యమునా, రామగంగా, గోమతి, శారదా,రప్తి వంటి అనేక నదులు ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తున్నాయి. వారణాసిలో గంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నది ఉప్పొంగి ప్రవహిస్తుండంతో లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా నీటమునిగాయి. ప్రయాగ్‌రాజ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నది మట్టాలు పెరగడం వల్ల నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లనుంచి బయటికి రావాలంటే ప్రజలు పడవల్లో ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read : రష్యాలో భూకంపం: 600 ఏళ్ల తర్వాత మళ్ళీ పేలిన అగ్నిపర్వతం

మరోవైపు  అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) అంతటా ఇదే పరిస్థితి.ససూర్ ఖాదేరీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కరేలా బాగ్ ప్రాంతంలో మొత్తం నీటమునిగింది. 
ఇక భారీ వర్షాలు, వరదలతో ప్రభావితం ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించింది యూపీ ప్రభుత్వం.. ఏరియల్ సర్వే నిర్వమించి వరదల కారణంగా ఇళ్లు నీటమునిగి నిరాశ్రయులైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 

భారీవర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. యూపీని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్.. స్మార్ట్ సిటీ ఇదేనా అంటూ కాషాయ పార్టీని విమర్శించారు. 

ప్రయాగ్‌రాజ్‌లో 20 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత, ప్రయాగ్‌రాజ్ నివాసితులకు నీటి ముప్పు తప్ప ఇంకేం వచ్చింది? అవినీతి అనే లోతైన గుంతల్లో నిండిన నీరు బిజెపి మోసాలు ,మోసాల చీకటి వ్యవహారాలను బహిర్గతం చేస్తోందని, స్మార్ట్ సిటీ భావనపై నీళ్లు చల్లిన బీజేపీ నేతలు తమ పడవలతో ఎక్కడ అదృశ్యమయ్యారు?" అని అఖిలేష్ Xలో పోస్ట్ చేశారు.

యూపీకి ఐఎండీ హెచ్చరిక..

రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. లక్నో, మౌ, గోరఖ్‌పూర్, బల్లియా, వారణాసి, సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలీ, జౌన్‌పూర్, ఘాజీపూర్, అజంగఢ్, ఖుషీనగర్, డియోరియా, సంత్ కబీర్ నగర్, బస్తీ, సీతాపూర్, బారాబంకి, బహ్రయిచి, శ్రాఖ్‌పూర్, బహ్రాయిచ్, బహ్రయిచ్, బహ్రయిచ్ వంటి 55 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

 బహ్రైచ్, బలరాంపూర్, లఖింపూర్ ఖేరి, సీతాపూర్, బారాబంకి, గోండా ,శ్రావస్తి వంటి ఉత్తర జిల్లాలలో వరదలు సంభవించవచ్చని హెచ్చిరించింది వాతావరణ శాఖ.