లారీల నిండా ఆయుధాలు.. భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు

లారీల నిండా ఆయుధాలు.. భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు, భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారీ విధ్వంసం చేసేందుకు లారీ నిండా ఆయుధాలతో కశ్మీర్ వ్యాలీ వైపు వెళ్తుండగా ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ లో హతమార్చారు. లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది ఆపి చెకింగ్ చేశారు. దీంతో ముగ్గురు టెర్రరిస్టులు అక్కడి నుంచి పరారై ఓ ఇంట్లో దాక్కోగా భద్రతా సిబ్బంది వారిని చుట్టుముట్టారు. మరోవైపు డ్రైవర్ అక్కడి నుంచి పరారైన వెంటనే లారీకి మంటలు కూడా అంటుకున్నాయి. మంటల్ని ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. 

ఉదయం జమ్మూ ప్రాంతంలోని సిధ్రా ఏరియాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. 2 గంటల పాటు అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు ఫైరింగ్ చేయడం, భద్రతా దళాలు చుట్టు ముట్టి కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. లారీలో పెద్ద ఎత్తున ఆయుధాలతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఎన్ కౌంటర్ తర్వాత ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సిధ్రా ఏరియాలో కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు జమ్మూలో హై అలర్ట్  ప్రకటించారు. 26 జనవరి సమీపిస్తుండడంతో భద్రతా చర్యలు పెంచామని ఆర్మీ అధికారులు తెలిపారు. 

జమ్మూకశ్మీర్ సిధ్రాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ట్రక్ లో వచ్చిన ముగ్గురు టెర్రరిస్టులు జమ్మూ ఏరియాలోని సిధ్రా ఏరియాలో ఓ ఇంట్లో దాక్కున్నారు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు కూడా ఫైరింగ్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ట్రక్ లో పెద్ద ఎత్తున ఆయుధాలతో జమ్మూ ఏరియాకు వస్తున్నట్లు పోలీసులకు, భద్రతా సిబ్బందికి సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన బలగాలు ట్రక్ ను పట్టుకున్నాయి. ట్రక్ కు కూడా మంటలు అంటుకున్నాయి. జమ్మూ ఏరియాలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లుగా అనుమానిస్తున్నారు. కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు జమ్మూలో హై అలర్ట్  ప్రకటించారు.