ఎంకే స్టాలిన్‌ కుమార్తె ఇంటిపై ఐటి అధికారుల దాడులు

ఎంకే స్టాలిన్‌ కుమార్తె ఇంటిపై ఐటి అధికారుల దాడులు

మరో నాలుగు రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ కుమార్తె ఇంటిపై ఇన్‌కమ్‌ ట్యాన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలక్షన్ల వేళ ఇంట్లో ఐటీ సోదాలు  కలకలం రేపాయి. ఇవాళ (శుక్రవారం) ఉదయం స్టాలిన్ కూతురు దుర్గా ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఐటీ సోదాలపై స్పందించిన స్టాలిన్‌.. ఇలాంటి ఆటంకాలకు భయపడబోమని తేల్చిచెప్పారు. స్టాలిన్ అల్లుడు శబరీశన్‌ డీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న కీలక వ్యక్తి కూడా ఇతనే. డీఎంకే వ్యూహకర్తల్లో ఒకరు శబరీశన్‌.