రాష్ట్రంలో కరోనా తర్వాతపెరిగిన దృష్టిలోపాలు

రాష్ట్రంలో కరోనా తర్వాతపెరిగిన దృష్టిలోపాలు
  • 18 ఏండ్లు దాటినోళ్లకే  టెస్టులు
  • 16 లక్షల మంది చిన్నారులకు కంటి సమస్యలు!
  • నాలుగు నెలల కింద జరిగిన పైలట్ సర్వేలో గుర్తింపు
  • అయినా ‘కంటి వెలుగు’లో పిల్లలను చేర్చని ప్రభుత్వం
  • ఓటర్లే టార్గెట్​గా స్కీమ్​ అమలు చేస్తున్నారంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్, వెలుగు: కంటి వెలుగు క్యాంపుల్లో పిల్లలకు టెస్టులు చేయడం లేదు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 18 ఏండ్లు నిండినవాళ్లకు మాత్రమే టెస్టులు చేస్తున్నారు. దీంతో పిల్లలకు టెస్టులు చేయిద్దామని అక్కడికి తీసుకెళ్లిన పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు నిరాశే ఎదురవుతున్నది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పిల్లలకు పరీక్షలు చేయబోమని క్యాంపు సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు. తమ స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు పెట్టి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు టెస్టులు చేయాలని విద్యా సంస్థల మేనేజ్​మెంట్లు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కంటి వెలుగు ప్రోగ్రామ్​లో  18 ఏండ్ల కట్ ఆఫ్‌‌‌‌కు ప్రాతిపాదిక ఏమిటని ప్రశ్నిస్తే.. ఆఫీసర్ల వద్ద సరైన సమాధానం లేదు. ప్రోగ్రామ్​ నుంచి పిల్లల్ని మినహాయించడానికి ప్రత్యేకంగా కారణం కూడా ఏమీలేదు. దీంతో.. ఓటర్లే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతున్నది.  

16 లక్షల మంది పిల్లల్లో సమస్య

కరోనా కారణంగా ఆన్​లైన్​ చదువులతో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగి పిల్లల కండ్లు ఖరాబ్ అయ్యాయి. క్లాసు రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బోర్డు కనిపించక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏ క్లాసులో చూసినా తక్కువల తక్కువ ఐదారుగురు పిల్లలు కండ్లద్దాలతోనే కనిపిస్తున్నారు. దీంతో పిల్లల కండ్లు ఎట్లున్నయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో నాలుగు నెలల కింద ఆరోగ్యశాఖ శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ సర్వే చేపట్టింది. సర్వేను అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రైబల్ అని మూడు రకాలుగా విభజించి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా అచ్చంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్కూళ్లలో పిల్లలకు కంటి పరీక్షలు చేయించారు. నిరుడు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ సర్వేలో ప్రతి వందలో 23 మంది పిల్లలు కండ్లు సరిగ్గా కనిపించక ఇబ్బంది పడుతున్నట్టుగా ఆఫీసర్లు గుర్తించారు. ఈ అంచనా ప్రకారం స్కూల్, ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 70 లక్షల మంది పిల్లల్లో సుమారు 16 లక్షల మంది పిల్లలకు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. అంతేగాకుండా.. కంటి సమస్య ఉన్న ప్రతి వంద మంది పిల్లల్లో 95 మంది పిల్లలు దూరం చూపు చూడలేకపోతున్నారని, దీని వల్ల బోర్డుపై రాసే అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలందరికీ కంటి పరీక్షలు చేసి, ఉచితంగా కండ్లద్దాలు అందజేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

పిల్లలను కూడా కంటి వెలుగులో చేర్చాలి

కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం పెద్ద వాళ్లకంటే పిల్లలకే ఎక్కువగా ఉంది. పిల్లలకు కంటి సమస్య ఉన్నట్టు ఎర్లీ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరెంట్స్ గుర్తించడం లేదు. ఫోన్లు, టీవీలు చూడనివ్వరన్న భయంతో, తమకు ఉన్న సమస్యను పిల్లలు తమ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పుకోవడం లేదు. సమస్య ఎక్కువైన తర్వాతే పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించి టెస్ట్ కోసం తీసుకొస్తున్నారు. సైట్ అప్పటికే చాలా ఎక్కువగా ఉంటుంది. స్ర్కీన్ టైమ్ పెరగడం, విటమిన్ ఏ డెఫీషియన్సీ వల్ల కరోనాకు ముందు కంటే, ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో పిల్లల ఓపీ ఉంటున్నది.  కంటి వెలుగులో పిల్లలను కూడా చేర్చి టెస్టులు చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలి.

‑ డాక్టర్ ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్తల్మాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్.

సమస్యను వదిలేయొద్దు

స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు పెట్టి పిల్లలకు టెస్టులు చేయించాలి. కరోనా తర్వాత చాలా మంది పిల్లలకు చూపు సమస్య వచ్చింది. ఎక్కువ సమయం స్ర్కీన్ చూస్తూనే గడపడం వల్ల కండ్లపైన చాలా ప్రభావం పడింది. చాలా మంది పిల్లలు దూరంగా ఉన్న వాటిని స్పష్టంగా చూడలేకపోతున్నారు. ఈ సమస్యను అలాగే వదిలేస్తే పిల్లల సైట్ మరింత పెరుగుతుంది. 

- డాక్టర్ ఎం.వంశీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,
మ్యాక్స్‌‌‌‌‌‌‌‌విజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌