ఇండియాకు బ్రాంజ్

ఇండియాకు బ్రాంజ్

జొహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరు (మలేసియా): సుల్తాన్ జొహార్ కప్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టోర్నీలో ఇండియా బ్రాంజ్ మెడల్‌‌‌‌‌‌‌‌ సాధించింది. శనివారం జరిగిన బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా పెనాల్టీ షూటౌట్‌‌‌‌‌‌‌‌లో 6–5తో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి పతకం గెలిచింది. నిర్ణీత టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ 3–3 గోల్స్‌‌‌‌‌‌‌‌తో సమంగా నిలిచాయి. పెనాల్టీ షూటౌట్‌‌‌‌‌‌‌‌ కూడా హోరాహోరీగా సాగుతూ సడెన్‌‌‌‌‌‌‌‌డెత్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా.. గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహిత్‌‌‌‌‌‌‌‌ చేసిన కీలక సేవ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా గెలిచింది.