సరిహద్దులో చైనా చట్టం కరెక్ట్​ కాదు

సరిహద్దులో చైనా చట్టం కరెక్ట్​ కాదు

న్యూఢిల్లీ: భూ సరిహద్దు ప్రాంతాల రక్షణ కోసం చైనా తెచ్చిన కొత్త చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇండో– చైనా బార్డర్ ఏరియాల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చేసేలా చైనా ఈ చట్టం చేసుకున్నదని తప్పుపట్టింది. కొత్త చట్టం సాకుతో బార్డర్​లో చైనా యాక్షన్ కు దిగబోదని ఆశిస్తున్నామని ప్రకటించింది. శనివారం చైనా పార్లమెంటు ఆమోదించిన కొత్త బార్డర్ చట్టం ప్రకారం.. ‘‘భూ సరిహద్దులు, భూభాగం రక్షణ కోసం చైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సరిహద్దుల్లో చైనా భూభాగాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది” అని లోకల్ మీడియా వెల్లడించింది. బార్డర్ లో డిఫెన్స్ ను మరింత పటిష్టం చేయాలని, బార్డర్ ఏరియాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కూడా చట్టంలో పేర్కొన్నట్లు తెలిపింది. అయితే బార్డర్ బౌండరీలపై ఇండియా, చైనా ఇంకా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయని, ఈ సమయంలో చైనా కొత్త చట్టం తేవడం బార్డర్ లో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని బుధవారం విదేశాంగ శాఖ తెలిపింది. బార్డర్ మేనేజ్ మెంట్ పై ఇదివరకే రెండు దేశాలు ఒప్పుకున్న నిర్ణయాలకు ఈ కొత్త చట్టం వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేసింది.