ఎఫ్​డీఐలు పెరుగుతాయ్

ఎఫ్​డీఐలు పెరుగుతాయ్

న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో మన దేశంలోకి 100 బిలియన్​ డాలర్ల ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్స్​ (ఎఫ్​డీఐ) వస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎకనమిక్​  రిఫార్మ్స్​ చురుగ్గా అమలు చేయడంతో పాటు, ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ మెరుగుపరచడంతో ఎఫ్​డీఐలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. 2021–22 లో మనకు 83.6 బిలియన్​ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 101 దేశాల నుంచి పెట్టుబడులు మన దేశంలోకి వస్తున్నాయి.

31 రాష్ట్రాలు, యూనియన్​ టెరిటరీలలో ఈ పెట్టుబడులు పెట్టారు. 57 సెక్టార్లలోకి విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎక్కువ రంగాలలో ఆటోమేటిక్​ రూట్​లోనే పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించినట్లు పేర్కొంది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్​–జూన్​) మాత్రం విదేశీ పెట్టుబడులు 6 % తగ్గి 16.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.