క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే యోచనలో కేంద్రం!

క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే యోచనలో కేంద్రం!

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ కరెన్సీపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సర్కార్ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలిసింది. క్రిప్టో కరెన్సీని రద్దు చేయడంతోపాటు ఇలాంటి డిజిటల్ అసెట్స్‌‌తో ట్రేడింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం గనుక క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే చట్టం తీసుకొస్తే బిట్‌‌కాయిన్‌‌తోపాటు డోజెకాయిన్, క్రిప్టో మనీ ఇన్వెస్టర్స్‌పై ప్రభావం పడనుంది. 

గత కొన్ని నెలలుగా క్రిప్టో కరెన్సీ నిషేధంపై ప్రభుత్వం పని చేస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లు దీన్ని పెద్దగా నమ్మలేదు. కానీ ఇప్పుడు చట్టం చేయాలని సర్కార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది చట్టంగా రూపొందితే క్రిప్టో కరెన్సీని చట్టవిరుద్ధం చేసిన మొదటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అవుతుంది. ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు తమ సొమ్మును లిక్విడేట్ చేయడానికి ఆరు నెలల గడువును విధిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో ఓవరాల్‌గా 7 మిలియన్ల మంది 1 బిలియన్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.