16 ఏళ్ల గరిష్టానికి తయారీ రంగం

16 ఏళ్ల గరిష్టానికి తయారీ రంగం

న్యూఢిల్లీ: ఉత్పత్తిలో బలమైన పెరుగుదల,  కొత్త ఆర్డర్లు బాగా రావడంతో మనదేశ తయారీ రంగ వృద్ధి ఈ ఏడాది మార్చిలో 16 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. కాలానుగుణంగా సర్దుబాటు చేసిన హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎమ్‌‌‌‌ఐ) ఫిబ్రవరిలో 56.9 నుంచి మార్చిలో 16 సంవత్సరాల గరిష్ట స్థాయి 59.1కి పెరిగింది.

 కొత్త ఆర్డర్‌‌‌‌లు, అవుట్‌‌‌‌పుట్,  ఇన్‌‌‌‌పుట్ స్టాక్‌‌‌‌ల బలమైన వృద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరణ అని అర్థం కాగా, 50 కంటే తక్కువ స్కోర్ సంకోచాన్ని సూచిస్తుంది. 2020 అక్టోబరు తరువాత ఇంత భారీగా పీఎంఐ నమోదు కావడం ఇదే మొదటిసారని హెచ్​ఎస్​బీసీలో ఆర్థికవేత్త ఇనెస్ లామ్ అన్నారు.  కన్జూమర్​, ఇంటర్మీడియట్,  పెట్టుబడి వస్తువుల రంగాలలో వృద్ధి చురుగ్గా ఉంది.  మే 2022 నుంచి కొత్త ఎగుమతి ఆర్డర్లు అత్యంత వేగంగా పెరిగాయి.