
కర్తాపూర్ కారిడార్ పై వాఘా బోర్డర్ లో భారత్-పాకిస్తాన్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల కోసం భారత అధికారుల బృందం వాఘా చేరుకుంది. పాకిస్తాన్ తరపున చర్చలు జరిపే కమిటీ నుంచి ప్రొ-ఖలిస్తానీ లీడర్ గోపాల్ సింగ్ చావ్లాను పాకిస్తాన్ తొలగించిన తర్వాతి రోజే రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. యాత్రికుల భద్రత, మౌలిక వసతుల కల్పన ప్రధానాంశంగా పెట్టుకుంది భారత్. కర్తార్ పూర్ కారిడార్ పై భారత్-పాక్ ల మధ్య ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి.
కర్తార్ పూర్ కారిడార్ ను పూర్తి చేసి, అందుబాటులోకి తెచ్చేందుకు పాకిస్తాన్ కట్టుబడి ఉందన్నారు ఆ దుశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్. గురుద్వారా నిర్మాణపనులు 70శాతానికి పైగా పూర్తి అయ్యాయని చెప్పారు.
India-Pakistan bilateral meeting on #KartarpurCorridor underway at Wagah, Pakistan. pic.twitter.com/fDignqQEKJ
— ANI (@ANI) July 14, 2019