కర్తార్‌పూర్‌ కారిడార్‌పై భారత్‌, పాక్‌ అగ్రిమెంట్

కర్తార్‌పూర్‌ కారిడార్‌పై భారత్‌, పాక్‌ అగ్రిమెంట్

భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్తాన్ లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా వరకు కారిడార్‌ను నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా భారత్, పాక్ దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. కర్తార్‌పూర్‌ కారిడార్‌కు సంబంధించి రెండు దేశాల ప్రతినిధులు అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా భారత్‌, పాక్  జీరోలైన్‌ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు.

కర్తార్‌పూర కారిడార్‌ ఒప్పందం… గురునానక్‌ దేవ్‌550 జయంతి ఉత్సవాల సందర్భంగా భారత్, పాకిస్తాన్ దేశాలు అత్యుతన్న స్థాయి చర్చలు జరిపారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల అవతల కర్తార్‌పూర్‌లోని ఈ గురుద్వారా ఉంది. భారత యాత్రికులకు ఎలాంటి వీసా లేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు. అయితే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. అయితే పాకిస్తాన్‌ మాత్రం 20 డాలర్ల సర్వీస్‌ చార్జీ వసూలు చేస్తోంది.