దేశంలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు

దేశంలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు

కరోనా కేసులు మరోసారి పెరిగాయి. కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరగడంతో ఆందోళన వ్యక్తమౌతుంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 2 వేల 380 కొత్త కేసులొచ్చాయి. యాక్టివ్ కేసులు 13 వేల 433కి పెరిగాయి. నిన్నటి కంటే ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. కరోనాతో మరో 56 మంది చనిపోయారు. 

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేసింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. నిన్న నిర్వహించిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. పాఠశాలలు తెరిచి ఉంచాలనే డిసీషన్ తీసుకున్నారు.

ఢిల్లీలో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కరోనాతో చనిపోయిన వారి శాంపిళ్లలో 97 శాతం ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మహమ్మారితో చనిపోయిన వారికి సంబంధించిన 578 శాంపిళ్లను జన్యుక్రమ పరిశీలనకు పంపించగా వారిలో 560 మంది ఒమిక్రాన్ బారిన పడినట్లు తేలింది.

మరిన్ని వార్తల కోసం

సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం..!

భారత్ కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని