ఆగని మృత్యు ఘోష...ఒకే రోజు 4106 మంది మృతి

ఆగని మృత్యు ఘోష...ఒకే రోజు 4106 మంది మృతి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం నాడు 2లక్షల 81వేల 386 కేసులు నమోదయ్యాయి. నిన్న 4వేల 106 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 3లక్షల 78వేల 741 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల 9న 3లక్షల 66వేల 161 కేసులు,  10న 3 లక్షల 29వేల 942 కేసులు, 11న 3 లక్షల 48వేల 421 కేసులు, 12న 3 లక్షల 62వేల 727 కేసులు, 13న 3 లక్షల 43వేల 144 కేసులు, 14న 3 లక్షల 26వేల 98 కేసులు, 15న 3 లక్షల 11వేల 170 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2 కోట్ల 49 లక్షల 65 వేల463 కు చేరగా మరణాల సంఖ్య 2,74,390 కి చేరాయి. ఇంకా 35,16,997 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.