భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్  కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,750 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్ బారిన పడి తాజాగా మరో 123 మంది బాధితులు చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,81,993 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 9249మంది కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42 కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 145.68 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

మరోవైపు భారత్ లో 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల్లో కూడా మంత్రులు, అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్స్, కాలేజీ పిల్లలకు తల్లిదండ్రులు లేదా టీచర్ల సమక్షంలో కోవిడ్ టీకా ఇస్తున్నారు. పిల్లలంతా తప్పకుండా  వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.  టీనేజ్ పిల్లలందరికీ కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు.