ఫారెక్స్ రిజర్వ్‌‌లు 4.82 బిలియన్ డాలర్లు డౌన్‌‌

ఫారెక్స్ రిజర్వ్‌‌లు 4.82 బిలియన్ డాలర్లు డౌన్‌‌

న్యూఢిల్లీ: ఇండియా ఫారెక్స్ రిజర్వ్‌‌లు  ఈ ఏడాది  ఏప్రిల్‌‌ 24తో ముగిసిన వారంలో 4.82 బిలియన్ డాలర్లు తగ్గి 698.49 బిలియన్ డాలర్లకు చేరాయి.  ఇందులో ఫారిన్‌‌ కరెన్సీ ఆస్తులు 2.84 బిలియన్ డాలర్లు తగ్గి 554.62 బిలియన్ డాలర్లుగా,  గోల్డ్‌‌ రిజర్వులు 1.90 బిలియన్ డాలర్లు తగ్గి 120.24 బిలియన్ డాలర్లుగా  నమోదయ్యాయి. 

స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌‌డీఆర్‌‌‌‌లు)  67 మిలియన్ డాలర్లు తగ్గి 18.77 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌) వద్ద భారత రిజర్వ్‌‌ పొజిషన్‌‌ కూడా 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది.  ఏప్రిల్‌‌ 17తో ముగిసిన వారంలో ఫారెక్స్  రిజర్వులు 2.3 బిలియన్ డాలర్లు పెరిగి 703.30 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫిబ్రవరి చివర్లో రిజర్వులు అత్యధిక స్థాయి 728.49 బిలియన్ డాలర్లను తాకాయి.