World Bridge Olympiad: పేకాటలో ఇండియాకు సిల్వర్ మెడల్..

World Bridge Olympiad: పేకాటలో ఇండియాకు సిల్వర్ మెడల్..

మన దేశంలో జూదం(పేకాట) ఆడటం తప్పు.. దీనిపై నిషేధం కూడా ఉంది.. మరి పేకాటలో దేశానికి పతకం రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! నిజమేనండోయ్.. మనోళ్లు జూదంలో మెడల్ కొట్టారు. 

బ్యూనస్ ఎయిర్స్‌ వేదికగా జరిగిన వరల్డ్ బ్రిడ్జ్ ఒలింపియాడ్‌లో ఇండియా సీనియర్స్ బ్రిడ్జ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికన్లతో జరిగిన ఫైనల్లో మనోళ్లు కాసింతలో పసిడి చేజార్చుకున్నారు. ఫైనల్లో భారత జట్టు 258- 165 తేడాతో అమెరికా చేతిలో ఓటమి పాలైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. మొదటి రెండు రౌండ్ల తర్వాత ఇరు జట్ల స్కోర్లు దాదాపు టై అయ్యాయి. మూడో రౌండ్‌లో అమెరికన్లు పైచేయి సాధించి పసిడిని వశం చేసుకున్నారు.

భారత జట్టులో కమల్ ముఖర్జీ, విభాస్ తోడి, బాదల్ దాస్, ప్రణబ్ బర్ధన్, అరుణ్ బాపట్, రవి గోయెంకా, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అయిన గిరీష్ బిజూర్ ఉన్నారు.

ALSO READ : ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు గురై ఆటగాడు మృతి

ఏంటి ఈ గేమ్..?

ఈ ఆటను బ్రిడ్జ్ గేమ్ అంటారు. ఇదొక రకమైన పేకాట. ప్రపంచ వేదికపై పతకాలు అందించే గేమ్‌. ఓ టేబుల్‌.. చుట్టూ నలుగురు వ్యక్తులు కూర్చొని.. మధ్యలో పేక ముక్కలు వేసుకొని విజయం కోసం పోటీపడతారు. ఈ ఆటకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ అట నిర్వహించేందుకు ఓ సమాఖ్య కూడా ఉంది. అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించడం, ఆటకు ఆదరణ పెంచే చర్యలు చేపట్టడం దీని విధి.