కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చిన ఇండియన్​ సైంటిస్టు దంపతులు

కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చిన ఇండియన్​ సైంటిస్టు దంపతులు

2012లోనే ఆరుగురికి తీవ్రమైన ఇన్​ఫెక్షన్​
 మూసేసిన మోజియాంగ్​ రాగి గనిలో సోకిన కరోనా
 ఇప్పటి కరోనా లక్షణాలు, చికిత్స సేమ్​ టు సేమ్​ అని వెల్లడి

పూణె: కరోనా ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా! మహమ్మారి పుట్టినిల్లు చైనాలోని వుహాన్​ అంటారు కదా. ఓ చేపల మార్కెట్​ నుంచి అది జనానికి వ్యాపించిందని ముందు నుంచీ చెప్తున్నారు. అది వంద శాతం వుహాన్​ ల్యాబ్​లో చైనా సృష్టించిన వైరసేనని కొన్ని దేశాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఇప్పుడు మన దేశానికి చెందిన ఇద్దరు సైంటిస్టు దంపతులు డాక్టర్​ మోనాలీ రహల్కర్​, డాక్టర్​ రాహుల్  బాహులికర్  ఇంకో వెర్షన్​ చెబుతున్నరు. చైనాలో ఎప్పుడో మూసేసిన ఓ గనిలో మహమ్మారి ఉనికి ఉందంటున్నారు.
ఎట్ల గుర్తించిన్రు?
మహమ్మారి గుట్టు ఏంటో తేల్చేందుకు ప్రపంచంలోని చాలా మంది మొదట్లోనే పరిశోధనలు మొదలుపెట్టేశారు. ఆ క్రమంలో డ్రాస్టిక్​ అనే ఓ గ్రూప్​ ఏర్పాటైంది. ఆ గ్రూప్​లో ఈ ఇద్దరు భార్యాభర్తలూ చేరారు. దాని పుట్టుక మీద పరిశోధనలు చేశారు. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. కరోనా వైరస్​లలోని రకాలపైనా రీసెర్చ్​ చేశారు. ముందుగా ఇప్పుడున్న కరోనా వైరస్​కు లింకున్న ఆర్​ఏటీజీ13తో రీసెర్చ్​ మొదలుపెట్టారు. చైనాలోని యునాన్​ ప్రావిన్స్​లో ఎప్పుడో మూసేసిన మోజియాంగ్​ రాగి గనితో మహమ్మారికి లింకున్నట్టు గుర్తించారు. 
‘దీ సీకర్​’తో రూఢీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన వాళ్ల రేడియాలజీ, సీటీ స్కాన్​ల రిపోర్టులు.. ఆ ఆరుగురు రిపోర్టులతో పోలి ఉండడాన్ని మోనాలీ, రాహుల్​లు గుర్తించారు. ద సీకర్​ అనే ట్విట్టర్​ యూజర్​ పోస్ట్​ చేసిన కరోనా ఆర్టికల్స్​నూ సేకరించారు. ‘చైనా కరోనా డాక్టర్’గా పిలుచుకునే డాక్టర్​ ఝోంగ్​ నన్షన్​ థీసిస్​ను చదివారు. ఇప్పుడు కరోనా పేషెంట్లకు వస్తున్న సెకండరీ ఇన్​ఫెక్షన్లూ ఆ ఆరుగురిలో ఉన్నట్టు నిర్ధారించారు. ఇప్పుడు వాడుతున్న మందులనే నాడు వారికీ నన్షన్​ వాడినట్టు తేల్చారు. తద్వారా కరోనా మహమ్మారి ఉనికి 2012 నుంచే లింకులున్నాయని గుర్తించారు.

ఆరుగురిలో ముగ్గురు బలి
ఎప్పుడో మూసేసిన ఆ గని పూర్తిగా గబ్బిలాలతో నిండిపోయినట్టు వారిద్దరూ తేల్చారు. దాని నిండా గబ్బిలాల పెంటలున్నట్టు నిర్ధారణకు వచ్చారు. 2012లో ఆ గనిని శుభ్రం చేయడానికి వెళ్లిన ఆరుగురు వ్యక్తులు.. ఆ ఎండిపోయిన పెంటలను తొక్కడం వల్ల అది పగిలి ధూళి రూపంలో గాల్లో కలిసి ఉంటుందని అంచనా. అదే గాలిని వారు పీల్చుకోవడం వల్ల కరోనా సోకిందని తేల్చారు. కరోనా మహమ్మారి సోకినోళ్లలో ఉన్న జ్వరం, దగ్గు, రక్తంలో గడ్డలు వంటి లక్షణాలే వారిలోనూ ఉన్నట్టు గుర్తించారు.