Market Crash: కుప్పకూలిన దలాల్ స్ట్రీట్.. యుద్ధ భయంలో ఇన్వెస్టర్లు.. నిపుణుల మాటేంటి?

Market Crash: కుప్పకూలిన దలాల్ స్ట్రీట్.. యుద్ధ భయంలో ఇన్వెస్టర్లు.. నిపుణుల మాటేంటి?

Sensex-Nifty Crash: గడచిన రెండు రోజుల నుంచి భారత్ పాక్ మధ్య మెుదలైన ఘర్షణ వాతావరణం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు ముదురుతూ యుద్ధం దిశగా పయనిస్తున్న వేళ కీలక బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీలు ఇప్పటికే భారీ నష్టాలతో తమ ప్రయాణాన్ని నేడు ప్రారంభించాయి. నిన్నటి మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ.5 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేయగా.. ప్రస్తుతం పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి.

Also Read:-యుద్ధం వేళ వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ సూచన..

ఉదయం 10.09 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ 863 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 283 పాయింట్ల నష్టంతో ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 700 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 656 పాయింట్ల భారీ నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియా విక్స్ సూచీ కూడా దాదాపు 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  

నిపుణుల మాట ఏంటి..?
ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితులను అమెరికా నుంచి ఇతర ప్రపంచ దేశాల వరకు గమనిస్తూనే ఉన్నాయి. ఏకపక్షంగా పాకిస్థాన్ చేస్తున్న యుద్ధ కవ్వింపులను అవి ఖండిస్తూ రెండు దేశాలను సంయమనం పాటించాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిస్థితులపై గ్లోబల్ బ్రోకరేజ్ బెర్న్స్టన్ ప్రతినిధి వేణుగోపాల్ గర్రే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళ్లకపోవచ్చని పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భారత స్టాక్ మార్కెట్లు క్షీణతను చూశళాయని, అయితే తర్వాత పరిస్థితులు చక్కపడ్డాక తిరిగి పుంజుకున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా మార్కెట్ల పతనంలో బై ఎట్ డిప్స్ స్ట్రాటజీని కొందరు తెలివైన ఇన్వెస్టర్లు బలమైన షేర్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.