లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభం కావడం గమనార్హం. భారీగా నష్టపోయిన అనేక స్టాక్ లకు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతు లభిస్తుండడం ఊరట కలిగిస్తోంది. సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో.. 53,854 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 16,129 వద్ద ట్రేడవుతోంది.

ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వంటి సానుకూల పరిణామాల స్టాక్ మార్కెట్లకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది. మరో వైపు అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర మూడు డాలర్ల మేర ఎగబాకి ప్రస్తుతం 130 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అలాగే ఆసియా -పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

మాకు రాజకీయాలంటే పెద్ద టాస్క్