వీడియో: కెనడాలో ‘తిరంగ కార్ ర్యాలీ’

వీడియో: కెనడాలో ‘తిరంగ కార్ ర్యాలీ’

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇండియాలో ఘనంగా జరిగాయి. అయితే విదేశాలలో కూడా అక్కడున్న భారతీయులు ఇండిపెండెన్స్ డే ను గొప్పగా జరుపుకున్నారు. ఏ దేశంలో ఉన్నా సరే తమ మూలాలను మాత్రం మరచిపోలేదు. ఇండియాలో పుట్టిన వారికి ఆగష్టు 15, జనవరి 26 అంటే అంత గౌరవం. కెనడాలో సర్రే నుండి వాంకోవర్ వరకు ‘తిరంగ కార్ ర్యాలీ’నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇండియాకు చెందినవారు తమ కార్లతో ర్యాలీ తీశారు. కార్లపై ఇండియా మరియు కెనడా జెండాలను ఊపుతూ.. ఒకదానివెంట మరో కారుతో వాంకోవర్ బ్రిడ్జ్ పై ముందుకు సాగారు. దానికి సంబంధించిన వీడియోను ఇండియాకు చెందిన యువకులు తమ కారు నుంచి వీడియో తీశారు. ‘గురుకుల్ కెనడా’ మరియు ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా-కెనడా’సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించాయి.

For More News..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం..

చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

రిటైర్ మెంట్ పై ధోని భార్య హార్ట్ ఫెల్ట్ పోస్ట్